అలా జరగాల్సిన పనిలేదు. నిజానికి ఎక్కువసేపు సంభోగంలో పాల్గొనటమన్నది పురుషుడికి అసాధ్యం. ఎందుకంటే అంగ స్తంభనను ఎక్కువసేపు కాపాడుకోవటం కష్టం. ఒకవేళ స్తంభనను నిలుపుకొంటూ చాలాసేపు సంభోగం జరుపుతున్నా.. అంతసేపూ అతను స్త్రీకి తృప్తిని ఇస్తున్నాడనేం చెప్పలేం. యాంత్రికంగా ఏదో కానిచ్చేస్తూ.. ఆమెకు ఉత్తేజాన్నీ, ఉద్రేకాన్నిచ్చే ప్రాంతాలను ప్రేరేపిస్తుండకపోవచ్చు. వాటిని అసలు పట్టించుకోకపోవచ్చు. భావప్రాప్తి కలగాలంటే ఆమెకు అవసరమైన గాఢమైన స్పర్శలనూ, స్పందనలనూ ఇవ్వటం ముఖ్యంగానీ గంటలతరబడి సంభోగాన్ని కొనసాగించటం కాదు. దీనికి పూర్తి భిన్నంగా- కొద్దిసేపే సంభోగించినా ఆమెలో గాఢమైన స్పందనలు వచ్చేలా, తృప్తినిచ్చేలా చెయ్యొచ్చు. కాబట్టి శృంగారంలో తృప్తికి ‘ఎంత సేపు?’ అన్నదొక్కటే కొలమానం కాదు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే- ఆమె మనసు తెలుసుకోవటం, ఒకరి భావనలను ఒకరు పంచుకోవటం! ఎందుకంటే అందరికీ ఒకే రకమైన ప్రేరణలు తృప్తినివ్వాలనేం లేదు. అందరికీ ఒకటే పద్ధతి పనికిరాదు. స్త్రీలలో కూడా రకరకాల భావాలు, విశ్వాసాలు, భావోద్రేకాలు ఉంటాయి. కొందరికి కొన్ని పనులు నచ్చవు. కొందరికి కొన్ని బాగా ఇష్టంగా ఉండొచ్చు. కాబట్టి ఆమె మనసు తెలుసుకుని, బిడియాలు, సంకోచాల్లేకుండా, అరమరికలు లేకుండా ప్రవర్తించటం ముఖ్యం. స్త్రీలు కూడా తాము మనసులో ఏదో ఆశిస్తూ.. వాటిని పైకి చెప్పకుండా.. భాగస్వామి తమను పట్టించుకోవటం లేదనుకోవటం సరికాదు. తన ఇష్టాయిష్టాలను, వాంఛలను, తమకు ఇష్టమైన పనులనూ-పద్ధతులనూ భాగస్వామికి తెలియజెయ్యటం ముఖ్యం. ఇది లేకపోతే సంభోగం ఎంతసేపున్నా ఆనందం, భావప్రాప్తి ఉండకపోవచ్చు. కాబట్టి ఎంతసేపు సెక్స్‌లో పాల్గొన్నారనే దానికంటే.. ఎలా పాల్గొంటున్నారనేదే ముఖ్యం. ఇద్దరికీ ఇష్టమై, ఎక్కువసేపు సెక్స్‌లో పాల్గొనగలుగుతుంటే మంచిదే. ఏమైనా సంభోగం ఎక్కువసేపు కొనసాగాలంటే అతనికి స్తంభనా, ఆమెలో స్రావాలూ, తగినంత ప్రేరణ, దీనికి ఇరువురిలోనూ గాఢమైన వాంఛా ఉండటం అవసరం. ఇరువురిలోనూ, అన్నీ ఇలాగే అమరటం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు కూడా.