మగవారిలో సంతానోత్పత్తి పెంచే ఆహార పదార్ధాలు – స్పెర్మ్ నాణ్యతను, ఉత్పత్తిని మెరుగు చేసేవి
వెల్లుల్లి : వెల్లుల్లి స్త్రీపురుషులిద్దరికీ కూడా ఫెర్టిలిటిని పెంచే సూపర్ ఫుడ్. దీనిలోని విటమిన్ బి6 చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
దానిమ్మ : దానిమ్మ గింజలు, రసం, స్పెర్మ్ కౌంట్ ను, చలనశక్తిని, నాణ్యతను పెంచటంలో తిరుగులేనివి.
అరటి : మంచి వీర్వవృద్ధికి అవసరమైన అన్ని కారకాలు అరటిలో పుష్కలంగా లభిస్తాయి. బి1, ఏ, సి విటమిన్స్, ప్రొటీన్లు లభిస్తాయి. అరటిలో ఉండే బ్రోమలెయిన్ శక్తివంతమైన సెక్స్ హార్మోన్ గా పనిచేస్తుంది.
పాలకూర : పాలకూర ఫోలిక్ యాసిడ్ కు మంచి ఆధారం, మంచి వీర్వఉత్పత్తికి సహకరించి, డి ఎన్ ఏను పరిరక్షిస్తుంది.
మిరపకాయలు : చాలామంది వీటిని తినరు, కానీ ఈ సూపర్ ఫుడ్ మేల్ ఫెర్టిలిటిని పెంచటంలో బాగా సహకరిస్తుంది. క్రమం తప్పకుండా మిరపను ఆహారంలో భాగం చేసుకోవటం వలన ఎండార్ఫిన్లను ఉద్దీప్త చేస్తాయి. ఫలితంగా శరీరం బాగా రిలాక్స్ అవుతుంది. సి, బి. ఏ, ఇ విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి.
టమాటొ : అత్యంత సాధారణంగా వాడే ఈ భారతీయ కూరగాయ యాంటీ ఆక్సిడెంట్, కెరటోనాయిడ్ లికోపెన్......ఇవి చక్కని వీర్య చలనశక్తికి, ఆరోగ్యానికి సహకరిస్తుంది. ప్రతి రోజూ ఏదో విధంగా టమాటోలను ఆహారంలో తీసుకోవాలి
పుచ్చ : పుచ్చలో సమృద్ధిగా ఉండే లికోపెన్, నీటిశాతం మేల్ ఫెర్టిలిటీని మెరుగుపరుస్తాయి. మగవారికి తమశరీరాన్ని ఎప్పుడూ మంచి హైడ్రేషన్ తో ఉంచుకోవటం అవసరం. మరీ ముఖ్యంగా పిల్లలు కావాలనుకునే వారికి ఈ జాగ్రత్త మరీ అవసరం.
విటమిన్ సి : మేల్ ఫెర్టిలిటీ పెరుగుదలకు ఇది అత్యంత అవసరం. వీర్యంలో డి ఎన్ ఏను ఇది పరిరక్షిస్తుంది. అయితే స్మోకింగ్ శరీరంలోని సి విటమిన్ ను హరిస్తుంది. కాబట్టి పిల్లలకోసం ప్లాన్ చేసుకునేవారు స్మోకింగ్ మానివేయాలి.
యాపిల్ : యాపిల్ లో గల ఎన్నో ప్రయోజనాలలో మేల్ ఫెర్టిలిటీని పెంచడం ఒకటి. స్పెర్మ్ కౌంట్ ను గణనీయంగా వృద్ధి చేయగలదు. ముఖ్యంగా యాపిల్ సిడార్ వెనిగర్ రూపంలో తీసుకున్నప్పుడు ఈ ప్రయోజనం ఎక్కువ అద్భుతాలు చేస్తుంది.
జీడిపప్పు : భోజనాల్లో నట్స్ తినటం వలన కడుపు నిండి, బరువును నియంత్రించుకోవటమ కాకుండా, జింకుశాతం ఎక్కువగా ఉండి ఫెర్టిలిటీని మెరుగుపరుస్తాయి.