header

Ankapur Country Chicken Curry….అంకాపూర్ నాటుకోడి కూర

Ankapur Country Chicken Curry….అంకాపూర్ నాటుకోడి కూర

Ankapur Country Chicken Curry….అంకాపూర్ నాటుకోడి కూర రోటిలో దంచిన మసాలాలు కలిపి తయారు చేసే అంకాపూర్ నాటుకోడి కూర రుచి తిని చెప్పాల్సిందే.
కుమార్ గౌడ్, భూపేష్, కిష్టయ్యలకు చెందిన ఆర్డర్ మెస్ లో ప్రత్యేకంగా వండే నాటుకోడి లభిస్తుంది. మూడు దశాబ్దాల క్రితం ఈ హోటళ్లు మొదలుపెట్టారు.
నాటుకోడిని కాల్చి, ముక్కలు చేసి రోటిలో నూరిన మషాలాలు పట్టించి నాణ్యతలో రాజీపడకుండా వండుతారు.
నిజామాద్ వెళ్లినవారు ఈ హోటల్ లో తప్పకుండా భోజనం చేస్తారు. అంకాపూర్ నిజామాబాద్ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నిజామాబాద్‌-ఆర్మూరు ప్రధాన రహదారిపై ఉన్న ఈ గ్రామానికి నాటు కోడికూర తయారీలోనూ ప్రత్యేక స్థానం ఉంది. దీనితో అంకాపూర్ పేరు నిజామాబాద్‌ సరిహద్దులు దాటి.. దేశవిదేశాలకు పాకింది.
ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 1985లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫియట్‌ కారును నడుపుకుంటూ ఒక్కరే అంకాపూర్‌కు వచ్చి విలేకరినని చెప్పి నాటుకోడి మాంసం రుచి చూసి ఫిదా అయ్యారు. ఆ తరువాత తమ గ్రామానికి వచ్చింది ఎమ్మెల్యే అని తెలిసి గ్రామస్థులు చాలా సంతోషించారట. ఈ విషయాలను కేసీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో అంకాపూర్‌ వచ్చినప్పుడు గుర్తుచేసుకున్నారు. ఆయన మాత్రమే కాదు ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ రుచికి ఫిదా అయ్యారు.
నలభై ఏళ్లుగా అదే రుచి...
నలభై ఏళ్ల క్రితం ఆ ఊరికి ఈ రుచిని పరిచయం చేసింది పెద్ద రామాగౌడ్‌. ప్రస్తుతం ఈయన కుమారుడు మల్లాగౌడ్‌ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అంకాపూర్‌ రుచులను అందిస్తూ మాంసాహార ప్రియులను ఆకట్టుకుంటున్నారు.
నలుగురికి సరిపడా అన్నం, నాటుకోడి కూర.. ఒక ప్యాక్‌ కింద అందిస్తారు. ప్రస్తుతం దీని ధర రూ.550. మసాలాలు ప్రత్యేకం..
ఇళ్ళల్లో, హోటళ్ళలో వాడే మసాలాలకు భిన్నంగా వీరు మసాలా దినుసులను వాడతారు. తరిగిన ఉల్లిగడ్డలు, దంచిన అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, కరివేపాకు, పసుపు ప్రధానంగా ఉపయోగిస్తారు. వాటితోపాటూ కల్వంలో దంచిన ఎండు కొబ్బరి తురుము, పల్లీల పొడి, యాలకులు, లవంగాలు, సాజీర, కొత్తిమీర ఈ రుచికి ప్రధాన కారణం. కూర తయారీలో సంప్రదాయ పద్ధతులనే అనుసరిస్తారు. కల్వంలో వేసి దంచుతారు.