హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ బస్టాండ్ ప్రాంగణం.. ఉదయం పదకొండు గంటల సమయం..... ప్రక్కనే ‘బిర్యానీ పదిరూపాయలు’ బోర్డు...... దుకాణం దగ్గర జనాల సందడి.
పేదవాళ్లే కాదు మార్కెటింగ్ ఉద్యోగాలు చేసేవారు, పనులు చేయడానికి వచ్చే కూలీలు.. విద్యార్ధులు... ఈ ‘పదిరూపాయల బిర్యానీ’ పాయింట్‌కి ఖాతాదారులు. ఈ బిర్యానీ పాయింట్ యజమాని ఇస్తెకార్.
ఇస్తెకార్ పదిహేనేళ్లక్రితం అఫ్జల్‌గంజ్ బస్‌స్టేషన్ దగ్గర ఉడకబెట్టిన శెనగలు అమ్మేవాడు. తరువాత ఐదురూపాయలకే వెజ్ బిర్యానీ దుకాణం మొదలు పెట్టాలు. సామాన్యులకు ధర అందుబాటులో ఉండటంతో ఈ బిర్యానికి ఆదరణ పెరిగింది.
కాలక్రమంలో బియ్యంతో పాటూ కూరగాయల ధరలు పెరగడంతో....ఇప్పుడు ప్లేట్ బిర్యానిని పదిరూపాయలకు అమ్ముతున్నాడు. పదిరూపాయలకు పొగలుకక్కే వేడి బిర్యానీ.. ఒకరికి సరిపోతుంది. ఇస్తెకార్ అన్నదమ్ములూ ఈ పనిలో అతనికి సాయంగా ఉంటున్నారు.
ఉదయం పదకొండు గంటల నుంచి.. మధ్యాహ్నం మూడింటి వరకు ఈ బిర్యానీ దొరుకుతుంది.