చార్మినార్ ప్రాంతంలో ఉన్న అక్బర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు కేవలం చికెన్ 65 తింటానికే వెళతారు ఆహార ప్రియులు. ఇతర ప్రాంతాలలో దొరకే చికెన్ కు ఇక్కడ లభించే చికెన్ కు తేడా ఉంటుందంటారు వీరు.
మటన్ బిర్యానీ, మటన్ హండి, జంబో ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్ లు తందూరీ, బోన్ లెస్, బోన్, లివర్ రకాలు లభిస్తాయి.
రాత్రిపూట రద్దీ ఎక్కువగా ఉంటుంది. కూర్చొని తినటానికి వీలుంటుంది కానీ పార్కింగ్ ప్లేస్ లేదు. సాయంత్రం నాలుగు గంటలనుండి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. మటన్ బిర్యానీ రూ.140.. చికెన్ బిర్యానీ రూ.130.. మాత్రమే.
చార్మినార్ కు దగ్గరగల మక్కామసీదు పక్కనే ఈ ఫాస్ట్ ఫుడ్ కార్నర్ ఉంది.
స్విగ్గీ నుండి ఆర్డర్ చేయవచ్చు. ఫోన్ 93475 27964