స్క్వేర్ బ్రెడ్, చార్‌కోణీ నాన్, నాన్‌రోటీ లకు పేరుపొందిన ప్రాంతం హైదరాబాద్ పాతబస్తీ. పురానీహవేలీ దగ్గర చేసే అబ్బాసీ నాన్ అంటే ఆహారప్రియులకు మక్కువ. 150 సంవత్సరాలకు చరిత్ర ఈ రొట్టె ఉంది. 1853లో ఈ నాన్‌ని ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల కోసం ప్రత్యేకంగా తయారుచేసేవారట.
తర్వాత ఈ రుచి అందరికీ నచ్చడంతో వివిధ రకాల కాంబినేషన్లతో ఈ నాన్‌రోటీని తినేందుకు అందరూ ఆసక్తి చూపించడంతో ఈ రొట్టె అంతర్జాతీయంగా పేరు సంపాదించుకుంది. మైదా, ఉప్పు కలిపి పులియబెట్టిన పిండితో రొట్టెలు చేసి నిప్పుల సెగపై బట్టీల్లో ఉంచి కాల్చి తయారుచేస్తారు. ఇందుకోసం గాబు లేదా గంగాళానికి చుట్టూ మట్టీబట్టీలు కట్టి అందులో ఈ నాన్‌లని ఉంచి కాల్చుతారు. వీటిని కాల్చేతీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
మైదాతో చేసిన రొట్టెలని ఒక చిన్నమెత్తపై ఉంచి బట్టీల్లో సర్ది, పొడవాటి ఊసలతో బయటకు తీస్తారు. చార్మినార్‌ని చూడ్డానికి వచ్చే ఫుడ్ వాకర్స్‌తోపాటూ ఐటీ కంపెనీలు తమ అతిథులకు వడ్డించడానికి ఈ రొట్టెలను కొనుగోలు చేస్తారు. అందరికీ తెలిసిన చార్‌కోణీనాన్‌తో పాటు ఓవెల్, హార్ట్ ఆకృతి నాన్‌లు కూడా ఇక్కడ దొరకుతాయి. రుచిలో మామూలు బ్రెడ్ కంటే బాగుండటంతో ఎక్కువ మంది వీటిని తింటారు. నాలుగు రకాల నాన్‌లు ఇక్కడ లభ్యమవుతుంటాయి