స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపటానికి, కొద్దిసేపు ముచ్చటిస్తూ ఫుడ్ ఆస్వాదించవచ్చు. మిర్చి బజ్జీ, పకోడ, వడ, లస్సీ, శాబ్ విచ్, ఎగ్ పకోడా, సమోసాలు లభిస్తాయి.
ఈ సెంటర్లోని జింజర్ టీ తాగారంటే తలనొప్పి ఎగిరిపోవాల్సిందే. స్నేహితులతో సరదా తింటూ కొద్దిసేపు గడపటానికి అనువైన ప్రదేశం ఇది.
రద్దీగా ఉన్నప్పటికీ వెంటనే అడిగినవి ఇస్తారు. కూర్చొని తినేందుకు విశాలమైన స్థలంలో బల్లలు ఉన్నాయి. కార్లకు మాత్రం పార్కింగ్ సౌకర్యం లేదు. బైకులు పక్కనే నిలుపుకోవచ్చు.
ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తెరచి ఉంటుంది. టీ, కాఫీలు రూ.20...దాకా ఉన్నాయి. మిగతావి రూ.40...దాకా అందుబాటు ధరలలో లభిస్తాయి.
ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బంజారా హిల్స్, జి.వి.కె సమీపంలో రోడ్ నెం.5లో ఉంది.