సర్వపిండి తెలంగాణా ప్రాంతంలో పేరుపొందిన వంటకం. సిద్ధి పేట వీరేశం సర్వపిండి వంటకంలో సిద్ధ హస్తుడు. ఇతని దగ్గర సర్వపిండి కొనటానికి పొరుగు జిల్లాలనుండి కూడా వస్తారు.
వీరేశం దగ్గర కొంటే ఇంట్లోనే చేసుకున్నంత రుచి. నాణ్యతలో కూడా తేడా ఉండదు.
బియ్యపు పిండిలో పల్లీలు, పచ్చిమిర్చు, కరివేపాకు ముద్దగా చేసి పిండిలో కలిపి చిన్న చిన్న ప్లేట్లలో ఉడికిస్తారు.
తెలంగాణాలోని సిద్ధిపేటకు వెళ్లి సర్వపిండి వీరేశం అంటే ఎవరైనా చెబుతారు.