వెండి నగిషీ కళను ఫిలిగ్రీ అంటారు. కరీంనగర్ ఈ కళకు పెట్టింది పేరు. సన్నని వెండి దారాలతో అతి సున్నితమైన, ఆకర్షణీయమైన వస్తువులు తయారవుతాయి. గంధపు గిన్నెలు, పళ్లాలు, రకరకాల పెట్టెలు, చెవిపోగులు, గొలుసులు, ట్రేలు, అగరుబత్తి స్టాండులు, పక్షుల బొమ్మలు, దేవుళ్ల పటాలు, హంస బొమ్మలు, వెండి పాత్రాలు, గాజులు, పెండెంట్స్ వంటివి కళాకారుల పనితనాన్ని తెలుపుతాయి.