వరంగల్ జిల్లాలోని పెంబర్తి గ్రామం లోహపు పనివారలకు ప్రసిద్ధి. గోడలకు తగిలించే అలంకార చిత్రాలు, పూల మొక్కల కుండీలు, విగ్రహాలు, ఆధునాతన స్టేషనరీ సామానులు, చాలా రకాల అలంకరణ వస్తువులు పెంబర్తిలో తయారవుతాయి. లోహపు రేకులతో వివిధరకాల ఆకారాలు ఎక్కువగా తయారవుతాయి. పంచలోహపు రేకులతో ఈ ఆకారాలను తయారు చేస్తారు. కాకతీయుల కాలంనుండి ఈ కళ అభివృద్ధిలోనికి వచ్చింది.