header

Dasaradhi Krishnamacharyulu…దాశరధి

Dasaradhi Krishnamacharyulu…దాశరధి
వీరు మహాకవి. పూర్తిపేరు దాశరధి కృష్ణమాచార్యులు. స్వాతంత్ర్యయోధులు. తిమిరంలో సమరం, అగ్నిధార, గాలిబ్ గీతాలు, రుద్రవీణ ఇతని కవితలు.వీరు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. వీరి పూర్తిపేరు దాశరధి కృష్ణమాచార్య. దాశరధిగా పేరు పొందారు. సంస్కృతం, ఆంగ్ల, ఉర్దూ భాషలలో పండితుడు. కథలు, నాటికలు, సినిమా పాటలు వ్రాసారు.
వీరు వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో 1925 జులై 22న జన్మిం చారు. (ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మంలో ఉంది)
నిజాం ప్రభుత్వపాలన వ్యతిరేకంగా తన గళం విప్పిన మహాకవి. నా తెలంగాణా కోటిరతనాల వీణ అని చాటిచెప్పారు. ఆంధ్రమహాసభలో ముఖ్యపాత్ర వహించి జైలు పాలయ్యాడు. ఉత్తేజపూరిత ప్రసంగాలతో ప్రజలలో చైతన్యం రగిలించాడు.
ఆంధ్రప్రదేశ్ ఆస్ధానకవిగా1977 ఆగస్టు 15 నుండి1983 వరకు పనిచేశారు. ఈయన వ్రాసిన కవితా సంపుటాలు అగ్నిధార, రుద్రవీణ, మార్పు నా తీర్పు, ధ్వజమెత్తిన ప్రజ, మహాంద్రాదోయం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం. కవితా పుష్పకం దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తిమిరంలో సమరం కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
వీరు 1987 నవంబర్ 5వ తేదీన మరణించారు.