వీరు గొప్ప సాంస్కృతిక వేత్త. గోల్కొండ పత్రికాధిపతి.ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఈయన ప్రసిద్ధ రచనలు. పత్రికా సంపాదకులుగా, రచయితగా, పండితుడిగా పేరుపాందారు.
వీరు 1896 మే 28వ తేదీన నాటి మహబూబ్ నగర్ జిల్లా ఉండవల్లి మండలంలోని ఇటిక్వాలపాడు గ్రామంలో జన్మించారు. బి.ఎల్ చదువుకుని కొంతకాలం న్వాయవాదిగా పనిచేశారు. ఈయన ప్రారంభించిన గోల్కొండ పత్రిక తెలంగాణి చరిత్రలో ఒక మైలురాయి. గోల్కొండ కవుల సంచిక అనే గ్రంధాన్ని రచించారు. ఇందులో తెలంగాణాకు చెందిన 354 మంది కవుల వివరాలను తెలిపాడు. వీరు రచించిన ఆంధ్రుల సాహిత్య చరిత్రకు ‘కేంద్ర సాహిత్య అకాడమీ’ అవార్డు లభించింది.
వీరు 1953 ఆగస్టు 25వ తేదీన పరమపదించారు.