విప్లవ మార్గాన్ని అనుసరించిన తెలంగాణా జాతీయవాది. అనేక ఉద్యమాలలో పాల్గొని జైలుజీవితం అనుభవించారు.
చిన్నతనంలోనే ఇంటిపని, వంటపనితో పాటు తెలుగు వ్రాయటం, నదవటం నేర్చుకున్నాడు. విజయవాడకు చేరి హోటల్ కార్మికుడుగా చేరాడు. అదే సమయంలోనే సమీప గ్రంధాలయంలో చాలా విజ్ఙాన విషయాలను నేర్చుకున్నాడు. తిరిగి హైదరాబాద్ కు వచ్చి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ గా చేరాడు. ఈ సమయంలోనే బూర్గుల రామకృష్ణారావు, మాడపాడి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖలతో పరిచయం ఏర్పడింది. ప్రూఫ్ రీడర్ నుండి పాత్రికేయునిగా, పత్రికా సంపాదకునిగా, ప్రచురణకర్తగా మారారు. కథల, నవలల రచనలు మొదలు పెట్టారు.
నిజాం నవాబు అక్రమాలను ఎదిరించాడు. దోపిడీకి గురౌతున్న ప్రజలను చైతన్య పరచటానికి ‘ప్రజల మనిషి’ అన్న నవలను వ్రాసారు. స్త్రీల కష్టాలకు స్పందించి ‘ఆలు కూలి’ అనే చిన్న కథను వ్రాసారు. 1942వ సం.లో కాంగ్రెస్ కార్యకర్తగా జైలు శిక్ష అనుభవించారు. 1946 నుండి 1951 వరకు కమ్యూనిస్టు కార్యకర్తగా తిరిగి జైలు జీవితం అనుభవించారు.
నిజాం రాష్ట్రంలో అనేక గ్రామాలలో గ్రంధాలయాలు నెలకొల్పటానికి కృషి చేసారు.
వీరు 1905 సం. నవంబర్ 1వ తేదీన తెలంగాణాలోని నల్గొండ జిల్లా మాధవరంలో జన్మించారు. 1961 ఫిబ్రవరి 5వ తేదీన మరణించారు.