header

Anantagiri – Telangana Ooty…అనంతగిరి - తెలంగాణా ఊటి

Anantagiri – Telangana Ooty…అనంతగిరి - తెలంగాణా ఊటి
సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యంతో పర్యాటకులకు కనువిందు చేసే ప్రాంతం అనంతగిరి. ఈ ప్రాంతం అంతగా ప్రచారంలోకీ రాలేదు. కానీ ఇటీవల ఈ ప్రాంతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అక్కడి జలపాతాల గలగలలు, పక్షుల కిలకిల రావాలు, కొండ కోనలు, సేలయేటిధారలు, రాతి కట్టడాలు,సహజసిద్ధంగా ఏర్పడినగుహలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతాయి. దట్టమైన అడవుల మధ్య నెలకొ ఉన్న అనంతగిరి ప్రాంతం మూసీనది జన్మస్థానం కూడా. అనంతగిరిని తెలంగాణీ ఊటిగా పేర్కొంటారు.
అనంతగిరికి వేళ్తే పట్టణ బిజీ జీవితం మరచి పోవచ్చు. మనసుకెంతో హాయి కలుగుతుంది. ఆధ్యాత్మికం, ఆహ్లాదం ఈ రెండింటి కలయికే అనంతగిరి ప్రత్యేకం.
హైదరాబాద్ కు సుమారు 90 కిలో మీటర్ల దూరంలో కనువిందు చేస్తూ తెలంగాణ ఊటీగా పేరుగాంచిన పర్యాటక కేంద్రం అనంతగిరి.
వికారాబాద్‌ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి క్షేత్రంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. 3,763 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి ప్రకృతి సౌందర్యం ఆశ్ఛర్యం కలిగిస్తుంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ ప్రాంతంలోని కొండలు, అడవి అందాల మధ్య అనంత పద్మ నాభస్వామి ఆలయం ప్రత్యేకం..
ఈ క్షేత్రానికి పురాణ ప్రసిద్ధి కూడా ఉంది.విష్ణు పురాణంలో ఈ క్షేత్రం ప్రస్తావన ఉంది. ఆలయ సమీపం లో ప్రాచీనమైన గుండాలు ఉంటాయి. కొన్ని చోట్ల గుహలూ కనిపిస్తాయి. ఇందులో మహర్షులు తపస్సు చేసుకునేవారని చెబుతారు. మహావృక్షాలతో నిండిన దట్టమైన అనంతగిరి అభయారణ్యంలోని ఈ ఆలయం ఉంది.
అనంతగిరిలో ఏడాదిలో రెండు పర్యాయాలు జాతర జరుగుతుంది. కార్తీక మాసంలో 11 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు రాష్ర్టంలోని అనే జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. వారాంతాపు సెలవులు గడపటానికి మంచి ప్రదేశం అనంతగిరి. దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు కూడా వస్తుంటారు వసతి సైకర్యం : హరిత రిసార్ట్స్ లో ఉండవచ్చు (ఒక రోజుకు రూ.1500- (2018 సంవత్సరంలో)). ఈ రిసార్ట్స్ లో శాఖాహార, మాంసాహార భోజన సదుపాయం ఉంది. దక్కన్ ట్రైల్స్ రిసార్ట్ లో కూడా ఉండవచ్చు.
ఎలా వెళ్లాలి...?
అనంతగిరికి హైదరాబాద్ నగరం నుండి రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. రైలుమార్గం అయితే సికింద్రాబాద్ నుండి వికారాబాద్ దాకా రైలులో వెళ్లి అక్కడ నుండి బస్ లేక ప్రైవేట్ వాహనాలలో వెళ్లవచ్చు.