జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం అభయారణ్యం వేసవి తాపం కనిపించదు. ఎండ పడదు పెద్ద పెద్ద చెట్లు చక్కటి చల్లదనాన్నిస్తాయి.
పచ్చని చెట్లు మధ్య వడగాలి మాట మర్చిపోతారు. అటవీశాఖ వారు దట్టమైన అడవి మధ్యలో తాడ్వాయి దగ్గర ఏర్పాటు చేసిన వనకుటీరాలలో బస చేయవచ్చ.
ఈ అరణ్యంలో సమయం ఆనందంగా గడిచిపోతుంది. ఉదయాన్నే.. చెట్ల నుంచి తొంగిచూసే సూర్యుడి లేత కిరణాలు .. మనసుకు ఆనందం కలిగిస్తాయి. ఈ వనంలో సైకిల్ సవారీ కోసం ప్రత్యేకమైన ట్రాక్ కూడా ఏర్పాటు చేయబడింది. సైకిళ్లు అద్దెకు ఇస్తారు. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ.. సైకిల్ మీద తిరుగుతూ... ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. జింకలు, కుందేళ్లు .. కనిపించ వచ్చు. అడవిలో తిరగటానికి సహాయంగా గైడ్ ఉంటారు.
అభయారణ్యం విశేషాలన్నీ చెప్పగలరు. వనంలోని విశేషాలను చూపిస్తాడు.
ఆదిమమానవుల కాలంనాటి దామెరవాయి రాక్షస గుహలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. దట్టమైన అడవిలో ఉన్న బ్లాక్‌బెర్రీ ద్వీపం అందాలతో పాటు అక్కడే బర్డ్‌వాచింగ్ ఆస్వాదించవచ్చు. ఇక్కడి పర్యావరణ అధ్యయన కేంద్రం కూడాచూడదగ్గ స్థలం.
పర్యాటకుల కోసం అభయారణ్యంలో తాడ్వాయి దగ్గర ఆరు కుటీరాలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి అద్దె ఇద్దరికి రూ.2,000-. రాత్రికి ఇక్కడకు చేరుకుంటే ఉదయాన్నే అడవంతా తిరగవచ్చు. మళ్లీ సాయంత్రం తిరుగు ప్రయాణం అవ్వొచ్చు.
వారాంతపు సెలవుల్లో...హైదరాబాద్ నుంచి పర్యాటకులు బృందాలుగా ఏటూరునాగారం అరణ్యానికి వస్తారు. ట్రెక్కింగ్, రాక్‌క్లైంబింగ్ వంటి ఈవెంట్లతో రెండు రోజులు హాయిగా గడిపవచ్చు.
- వరంగల్ నుంచి తాడ్వాయికి 95 కిలోమీటర్లు. బస్సుల్లో, ప్రైవేట్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. వరంగల్ కు ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పట్టణాల నుండి రైలు సౌకర్యం ఉంది
- హైదరాబాద్ నుంచి ఏటూరునాగారం వెళ్లే బస్సులు తాడ్వాయి మీదుగానే వెళ్తాయి.