header

Pedagattu Lingamanthula Swamy Jatara….పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర

Pedagattu Lingamanthula Swamy Jatara….పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర

సూర్యాపేట సమీపంలో రెండేళ్ళకు ఒకసారి జరిగే ఈ జాతరకు (2019 ) తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుండి కూడా ప్రజలు లక్షలాదిగా వస్తారు. ఈ జాతరకు 200 సం॥ల చరిత్ర ఉన్నట్లుగా చెబుతారు. క్రీ.శ. 11వ శతాబ్ధంలో రాష్ట్రకూట వంశానికి చెందిన ద్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించాడని ఆయన పేరిట ఈ గ్రామానికి దురాజ్‌పల్లి అనే పేరు వచ్చిందటారు.
జాతర జరిగే ఐదు రోజుల పాటు పెద్దగట్టు పరిసరాలలో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారు. ఈ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. అన్న, చెల్లెళ్ళకు జాతరలో గాజులు కొనివ్వటం ఆనవాయితీ. అలాగే యాదవులు తమ సంపదలైన గోవులకు రక్షణగా నిలిచిన లింగమంతుని ఆరాధిస్తారు. లక్షలాది ప్రజలను ఆకర్షిస్తున్న ఈ జాతర 1967 నుండి నుండి ప్రభుత్వ గుర్తింపు పొందినది.
ఎలా వెళ్ళాలి : హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేటకు 6 కి.మీటర్ల దూరంలో ఉంది దురాజ్‌పల్లి గ్రామం.