తెలంగాణాలోని మహబూబ్ నగర్ సింగోటం గ్రామంలో ప్రతి సంవత్పరం జరిగే జరిగే జాతర ఇది. సంక్రాంతి పండుగ నుండి షుమారు నెలరోజుల పాటు జాతర వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు మహబూబ్ నగర్ నుండియే కాక తెలంగాణా అన్ని ప్రాంతాలనుండి జనం వస్తారు. సింగోటం జాతర ఎద్దుల పరుగు పందేలు మరియు ఎద్దుల బండలాగుడు పందేలకు ప్రసిద్ధి. సింగోటం గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం మరియు శ్రీలక్మ్షీ దేవి దేవాలయం ప్రసిద్ధి చెందినవి. సింగోటం గ్రామంలో శ్రీవారి సముద్రం అనే అందమైన జలాశయం కూడా ఉంది. ఎలా వెళ్ళాలి ? సింగోటం గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో ఉన్నది. వనపర్తి దగ్గలోని పట్టణం. వనపర్తినుండి బస్సుల ద్వారా సింగోటం గ్రామానికి వెళ్ళవచ్చు.