ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం పూర్తి అయిన తరువాత ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకని వ్యాసమహర్షి, విశ్వామిత్ర మహర్షి మొదలగు వారు శిష్యసమేతంగా ఈ ప్రాంతానికి వచ్చారట. ఈ ప్రదేశంలో ప్రశాంత వాతావరణానికి ముగ్ధులై.. ఇక్కడే తపస్సు కొనసాగించారంటానే. వ్యాస భగవానులు రోజూ పావన గోదావరిలో స్నానం చేశాక.. పిడికెడు ఇసుక చొప్పున తీసుకెళ్లి.. సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని రూపొందించారట! ఆ మూర్తికే ఆయన నిత్యపూజలు చేసేవారని.. ఇప్పుడు ఇక్కడున్న విగ్రహం అప్పట్లో వ్యాస మహర్షి ఆరాధించిన మూర్తేనని స్థలపురాణం! అలా వేద వ్యాస ప్రతిష్ఠగా పరిగణించే బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి సన్నిధిలో నిత్యం వేల మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేసుకుంటూ.. ఆ తల్లి దీవెనలు.. చల్లని చూపులతో విజ్ఞానవంతులుగా ఎదుగుతున్నారు.
ఆలయం తెరచే సమయాలు
- రోజూ ఉదయం 4 గంటలకే ఆలయద్వారాలు తెరుస్తారు.
- ఉదయం 4.30 గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తారు.
- అనంతరం 4.30 నుంచి 6.30 వరకూ అభిషేకం కొనసాగుతుంది.
- 6.30 నుంచి 7.30 గంటల వరకు విరామం.
- ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనం, అక్షరాభ్యాస పూజలు ఆరంభం.
- మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.00 గంటల వరకు మధ్యాహ్న విరామం
- మధ్యాహ్నం 2 నుంచి 6.30 వరకు దర్శనం, పూజలు
- సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సాయంత్ర ప్రదోషకాల పూజలు
- రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు హారతి. అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు.
వివిధ ఆర్జిత సేవలు/ పూజల వివరాలు
- అభిషేకసేవ టిక్కెట్టు: రూ.200- ఒక కుటుంబం లేదా నలుగురు మాత్రమే
- ప్రత్యేక దర్శనం ఒక టిక్కెట్టుపై ఒకరు మాత్రమే
- సాధారణ అక్షరాభ్యాసం: రూ. 100
- ప్రత్యేక అక్షరాభ్యాసం: రూ. 1000
- నిత్య చండీ హవనం: రూ. 500
- కుంకుమార్చన రూ.50
ఇతర దేవతలు : ప్రధాన సరస్వతీ ఆలయ అంతరాలయంలో మహాలక్ష్మీ. ఆలయానికి పశ్చిమ దిక్కులో మహాకాళీ కొలువై ఉంటారు. అంటే ఈ ఆలయం త్రిశక్తులైన లక్ష్మి.. పార్వతి.. సరస్వతి అమ్మవార్లు కొలువైన మహిమాన్విత క్షేత్రమన్న మాట. ఆలయానికి తూర్పున దత్తాత్రేయుడు, ఆలయం ముందు ప్రధాన రహదారి వద్ద వేదవ్యాస మహర్షి ఆలయం.. వ్యాసుల వారి గుహ.. గోదావరి నది.. నదీ తీరాన మహేశ్వర ఆలయం.. బస్టాండ్ సమీపంలోని వేదశిల (శ్రీ వేదవతిశిల) చూడవలసినవి
ఆలయంలో నిత్యం నిర్వహించే వివిధ పూజలు: అభిషేకం, అక్షరాభ్యాసాలు, సత్యనారాయణ వ్రతాలు, చండీ హవనం, కుంకుమార్చన.
ప్రత్యేక ఉత్సవాలు
- సరస్వతి అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి నాడు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. మహాభిషేకంతో పాటు అమ్మవారి పల్లకి సేవ నిర్వహిస్తారు.
- దసరా నవరాత్రి ఉత్సవాలనూ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్ర పర్వదినం రోజున మూల నక్షత్ర మహా సరస్వతీపూజ నిర్వహిస్తారు.
- గురుపౌర్ణమి సందర్భంగానూ ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తారు. సప్తశతి చండీయాగం చేసి. వేద పండితులకు సన్మానం నిర్వహిస్తారు.
- ఇక్కడ నిర్వహించే పూజలు.. ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యమేమీ లేదు.
మరిన్ని వివరాలకు ఆలయ విచారణ కేంద్రం ఫోన్: 08752-255503 నెంబరులో లేదా.. వెబ్‌సైట్:basaratemple.org ఇ-మెయిల్ ఐడీ:infobasaratemple.orgలేదా.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయంలోనైనా సంప్రదించవచ్చు.
బాసర సరస్వతీ ఆలయానికి వచ్చే భక్తుల వసతి కోసమని దేవస్థానం 100 సాధారణ గదులు, 18 ఏసీ గదులు అందుబాటులో ఉంచుతుంది. ఇంకా ఆలయం వద్ద వివిధ ఆలయాల నిధులతో నిర్మించిన అతిథి గృహాల్లోనూ వసతి అందుబాటులో ఉంది. పర్యాటక శాఖ వారి హరిత అతిథిగృహంతో పాటు పలు ప్రైవేటు లాడ్జిలు, రిసార్టుల్లోనూ వసతి సౌకర్యముంది. బాసరలోని హోటళ్ల సమాచారం కోసం www. basarahotels.com వెబ్‌సైట్‌ను చూడొచ్చు.
టి టి డి అతిథి గ్నృహం 4 గదులు ఒక్కొక్క గది ఎ.సి రూమ్ : 400- నాన్ ఎ సి రూ.150-(ఒక్క రోజుకు)
వేములవాడ అతిథి గృహం : 4 గదులు ఒక్కొక్క గది రూ.75- ఒక్క రోజుకు
నీలం ఘేకర్ అతిథి గృహం -4 గదులు (దాతలు కట్టించినవి) ఒక్కొక్క గది రూ.100- ఒక్క రోజుకు
గౌర్ల అతిథి గృహం: 2 గదులు (దాతు కట్టించినవి) ఒక్కొక్క గది రూ.150- ఒక్క రోజుకు
థర్మశాల : 9 గదులు ఒక్కొక్క గది రూ.100- ఒక్క రోజుకు
టిటిడి వారి అతిథి గృహాం -100 రూములు పెద్దవి ఒక్కొక్క గది రూ.100- ఒక్క రోజుకు
ఇవి కాక ఎ పి టి డి సి వారి పున్నమి హోటల్ వివరాలకు :08752-243691 మరియు బ్రాహ్మణు సత్రం, వైశ్యుల సత్రం దేవాలయంనకు దగ్గరలో కలవు.
ఇవికాక ప్రైవేటు వారి లాడ్జీలు 20 దాకా ఉన్నవి
17639 Kachiguda-Akola exp - All days - Kachiguda 07-30 Basara 11-20
18509- Visakhapatnam-Nanded exp. - Wednesday and Saturday Secunderabad 09-20 Basara 12-44
18309 Nagavali Exp - Monday and friday Secunderabad 09-20 Basara 12-44
08509 Visakhapatnam-Nanded - Tuesday Secunderabad 09-20 - Basara 12-45
17058 Devagiri Exp.- all days Secunderabad 13-35 Basara 16-43
17020 Hyb All exp. Hyd-Azmir Saturday Secunderabad 15-30 Basara 19-03
17064 Ajantha Exp. - All days Secunderabad 18-10 Basara 21-35
17045 Krishna Exp. - all days Secunderabad 21-10 Basara 00-30
Number of APSRTC buses, as frequent as every half-hour
are available from Imliban Bus station (MGBS), Hyderabad and
Jubilee bustation, Secunderabad, Nizamabad and Bhainsa.
Contact APSRTC for a detailed Schedule.
APSRTC Enquiry phone numbers:
040 - 23434268 General Enquiry
040 - 23434280 General Enquiry
040 - 24618685 General Enquiry
040 - 23434264 General Enquiry
040 - 24613955 and 040 - 23434269 - Reservation Enquiry.