280 అడుగుల ఎత్తున్న కాలాపహాడ్ అనే కొండపై ప్రముఖ పారిశ్రామిక వెత్తలైన బిర్లాలచే ఈ దేవాలయం నిర్మించబడినది. ఇక్కడ ప్రధాన దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి. ఈ దేవాలయం మొత్తం రాజస్థాన్ నుండి తెప్పించబడిన తెల్లరాయితో నిర్మించబడినది. ఇక్కడ కానుకలు స్వీకరించరు. నిర్వహణ మొత్తం బిర్లాలదే. రాజస్థాన్ మరియు ఉత్కళ సాంప్రదాయాలలో కట్టబడినది.
దేవాలయం దర్శనం వేళలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 3 గంటల నుండి 9 గంటల వరకు.
ఎలా వెళ్ళాలి
బిర్లా మందిర్‌కు హైదరాబాద్ సిటీ బస్సులో లేక ఆటోలో చేరుకోవచ్చు. దగ్గరలో గల బస్ స్టాప్ సెక్రటరియేట్ మరియు లకడీ-కా-పూల్.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 7 కి.మీ. నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి 3 కి.మీ. కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి 5 కి.మీ. దూరంలో కలదు.