header

Jagannath Swamy Temple… జగ్నన్నాధస్వామి ఆలయం, హైదరాబాద్‌

Jagannath Swamy Temple… జగ్నన్నాధస్వామి ఆలయం, హైదరాబాద్‌

ఈ ఆలయం 2009 సంవత్సరంలో ఒరియా సంఘం వాళ్ళచే కట్టబడినది. బంజారాహిల్స్‌లో రోడ్‌ నెం.12 లో కలదు. ఈ ఆలయం చక్కటి కళతో భక్తులకు కనువిందు చేస్తుంది
ఇక్కడ ప్రధాన దైవం జగ్నన్నాధస్వామి. ఈ ఆలయం పూరి జగ్నన్నాధాలయాన్ని పోలి ఉంటుంది. ఒరిస్సా నుండి తేబడిన 600 టన్నుల ఇసుక రాయిచే కట్టబడటం వలన ఈ దేవాలయం ఎరుపు రంగులో ఉంటుంది. ఇంకా ఇదే ఆలయ ప్రాంగణంలో వినాయకుని గుడి, లక్ష్మీదేవి, శివుడు, గణేషుడు, ఆంజనేయస్వామి మరియు నవగ్రహాలను దర్శించవచ్చు. గర్భగుడిలో జగ్నన్నాధ స్వామితో పాటు బలభద్రుని, సుభద్రా దేవి విగ్రహాలను దర్శించవచ్చు.
దేవాలయం ఆవరణ లోపల గోడలమీద దశావతారాలు, రామాయణ కథలు మనోహరంగా మలచబడ్డాయి. గుడి ఆవరణ ఆహ్లాదకరంగా ఉంటుంది.
దేవాలయం తెరచు సమయాలు ఉదయం గం.06-00 నుండి గం.11-00 వరకు సాయంత్రం 05-00 గంటల నుండి రాత్రి 08-00 గంటల వరకు పండగలు మరియు ముఖ్యమైన పర్వదినాలలో సమయాలు మార్చబడును
ఎలా వెళ్లాలి ? ఈ ఆలయం బంజారాహిల్స్‌లో రోడ్‌ నెం.12 లో కలదు. బంజారాహిల్స్‌లో ఎం.ఎల్‌.ఎ కాలనీ బస్‌స్టాప్‌ దగ్గర దిగితే పక్కనే జగ్నన్నాధస్వామి గుడి కనబడుతుంది. (కోఠీ, నాంపల్లి, లకడీకాపూల్‌, కొండాపూర్‌, జుబ్లీ చెక్‌పోస్ట్‌ నుండి బస్సులలో వెళ్లవచ్చు.)