మూడో నిజాం మీర్ అక్బర్ ఆలీ ఖాన్ హయాంలో హైదరాబాద్ సంస్థానంలో రాజా భవానీ పెర్షాద్ ఉన్నత ఉద్యోగి. ఈయన పరమ ఆస్తికుడు. ఎదిగి వచ్చిన కుమారుడు చనిపోవటంతో భవానీ పెర్షద్ శోకసమద్రంలో మునిగిపోయి రాముల వారి విగ్రహం ముందు తన విచారాన్ని వెళ్ళబుచ్చుకుంటాదు. ఓ రోజు శ్రీరాముడు కలలో కన్పించి ధైర్యం చెప్పి తనకు ఒక ఆలయం కట్టించి పూజించమని చెబుతాడు. భవానీ పెర్షాద్ హైదరాబాద్ శివార్లలోని అత్తాపూర్లో 10 ఎకరాల భూమిని సేకరించి ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడతాడు.
రాజా భవానీ పెర్షాద్ కోరికను మన్నించి నిజాం మీర్ అక్బర్ ఆలీ ఖాన్ (సికిందర్ ఝూ) ఈ దేవాలయాన్ని 1812లో తన చేతుల మీదుగా సీతారాముల లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించి ఆలయ నిర్వహనకోసం 50 ఎకరాల జాగీరును ఇస్తాడు.
ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీఖాన్ పాలనలో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందినది. నవాబు ఏటా శ్రీరామనవమినాడు రామచంద్రుడికి పట్టువస్త్రాలు సమర్చించే వాడు. అమూల్యమైన ఆభరణాలను కూడా చేయించాడు.
ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. భక్తతుకారాం (అక్కినేని నాగేశ్వరరావు నటించిన) చిత్రం ఇక్కడే చిత్రీకరించారు. ఇక్కడ ఉన్న గోశాలలో 20 ఆవుల వరకూ ఉన్నాయి. ఇక్కడ ఇంకా వందల సంవత్సరాల నాటి పద్మనాభస్వామి ఆలయం, హనుమాన్ ఆలయాలు కూడా ఉన్నవి.