ఈ దేవాలయం హైదరాబాద్ సంఫీునగర్ లోని పరమానందగిరి అనే కొండమీద ఉన్నది. ప్రధాన దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి.శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహం తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో చూపరులకు కనువిందు చేస్తుంది.స్వామివారి పూజ కోసం ఇక్కడే పవిత్రవనం అనే తోటలో పూలచెట్లు పెంచబడుచున్నవి.
దేవాలయం యొక్క పెద్ద ప్రవేశద్వారం భక్తులకు స్వాగతం చెబుతుంది. లోపల పెద్ద హనుమంతుని విగ్రహాన్ని చూడవచ్చు. అతి పెద్దదైన ఈ దేవాలయ రాజగోపురం చాలాదూరం నుండి కనపడుతుంది. ఈ దేవాలయం ప్రవేశం ద్వారం వద్ద 3 గాలిగోపురాలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటాయి.
దేవాలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది. భక్తులకు దర్శనం మాత్రం ఉదయం గ.8-30 ని నుండి గం.10.30 వరకు మరియు సాయంత్రం గం.4 నుండి 6 గంటల వరకు మాత్రమే.
ఎలా వెళ్ళాలి ? హైదరాబాద్‌కు షుమారు 30 కి.మీ దూరంలో సంఫీునగర్‌లో ఉన్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 205 కె మరియు 290 యస్ బస్సులో వెళ్ళవచ్చు (లాలాగూడ-తార్నాక-ఉప్పల్ రింగ్ రోడ్-యల్ బి నగర్-సంఫీునగర్) ఫోన్ : 040-24576443