header

Sri Raja Rajeswara Templa, Vemulawada…శ్రీరాజ రాజేశ్వర దేవాలయం, వేములవాడ, కరీంనగర్‌ జిల్లా

Sri Raja Rajeswara Templa, Vemulawada…శ్రీరాజ రాజేశ్వర దేవాలయం, వేములవాడ, కరీంనగర్‌ జిల్లా
పురాతనమైన ఈ దేవాలయంలో మహాశివుడు కొలువై ఉన్నాడు ఇక్కడ శివలింగాన్ని నీలలోహిత శివలింగం అనిపిలుస్తారు. ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ జాయింట్‌ కమీషనర్‌చే పర్వవేక్షించబడుచున్నది.
ఈ క్షేత్రాన్ని దక్షిణకాశి అని మరియు హరిహర క్షేత్రం అనికూడా పేరుపొందినది.ఈ క్షేత్రంలోనే శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం మరియు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాలు కలవు. ఈ క్షేత్రపాలకుడు శ్రీ అనంతపద్మనాభస్వామి. ఈ క్షేత్రం గుడిచెరువుగా పిలువబడే పెద్ద చెరువు ఒడ్డున ఉన్నది.
భవిష్యపురాణం ప్రకారం సూర్యభగవానుడు ఇక్కడ స్వామిని పూజించటం చేత భాస్కరక్షేత్రమని పిలుస్తారు. దేవతల రాజైన ఇంద్రుడు బ్రహ్మహత్యా నివారణకై శ్రీ రాజరాజేశ్వర స్వామిని పూజించాడని చెబుతారు. క్రీ॥శ 750 నుండి 973 లోపల ఈ దేవాలయం అర్జునుని మనుమడు పరీక్షత్‌ మహారాజు ఈ రాజు మనుమడైన రాజా నరేంద్రునిచే నిర్మించబడినదని చెబుతారు.
ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాల ప్రకారం ఈ దేవాలయం వేములవాడ చాళుక్యులచే కట్టించబడినదని (క్రీ॥శ 750 నుండి 973) ఇక్కడ దొరికిన రాతి శాసనం ద్వారా తెలుస్తుంది. అప్పట్లో వేములవాడ గ్రామాన్ని లేములవాటికగా పిలిచేవారు.
ఇక్కడ శ్రీ దక్షిణామూర్తి ఆలయం, శ్రీవల్లిదేవసేన సహిత శుబ్రఃమణ్యేశ్వరస్వామి, శ్రీ బాలత్రిపురాసుందరి, శ్రీ సోమేశ్వరాలయం, శ్రీ ఉమామహేశ్వరాలయం, శ్రీ మహిషాసుర మర్ధని ఆలయం,కోటిలింగాలు, శ్రీ కాలభైరవస్వామి మొదలగు ఉపాయాలను కూడా దర్శించవచ్చు
ఉత్సవాలు : ఇక్కడ జరిగే ఉత్సవాలలో మహాశివరాత్రి ముఖ్యమైనది.ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్నిజిల్లాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. దేవాలయం శివరాత్రి రోజున 24 గంటలు తెరచి ఉంటుంది. శ్రీరామనవమి : ఈ రోజున శ్రీసీతారాముల వారి కళ్యాణోత్పం మరియు రథోత్సవం జరుగుతుంది.
ఇంకా ఇక్కడ జరిగే ఉత్సవాలు : శివకళ్యాణం (5 రోజులు) శ్రీ హనుమాన్‌ జయంతి, శ్రీ గణేశ నవరాత్రులు, కార్తీక మాసోత్సవం, శ్రీ శంకర జయంతి, శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు (5 రోజులు)
యాత్రికులకు సౌకర్యాలు : యాత్రికులకు దేవస్థానం వారి సత్రం నందు మరియు డార్మెటరీనందు వసతి సౌకర్యం కల్పించబడును. సామాన్లు భద్రపరచుకొను సౌకర్యం కలదు
భోజన సదుపాయం : మధ్యాహ్న భోజనం మరియు రాత్రి భోజనం దేవస్థానం పలాహారశాల నందు కొద్దిపాటి ధరతో వడ్డించబడును
స్నానాలు మరియు బట్టలు మార్చుకొనే సౌకర్యం ధర్మగుండం వద్ద కలదు.
దేవస్థానం వారి హోమియోపతి వైద్యాలయం నుందు భక్తులకు ఉచితంగా మందు ఇవ్వబడును.
దర్శనవేళలు - ఆలయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి రాత్రి 10.20 గంటలకు పవళింపుసేవ అనంతరం మూసివేస్తారు.
- ధర్మదర్శనం ఉచితం, ప్రత్యేక దర్శనం రూ. 20, ప్రత్యేక ప్రవేశదర్శనం రూ. 100
- సాధారణ దర్శనం: ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రాత్రి 7.30 నుంచి 8.30 వరకు
- ప్రత్యేక దర్శనం: ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7.30 వరకు. ఒక టికెట్‌పై నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. - ప్రత్యేక దర్శనం టికెట్లకు పరిమితి లేదు.
- దర్శన సమయాల్లో ఎలాంటి విరామం లేదు.
- ప్రత్యేక దర్శనం టికెట్ల వివరాలు: ప్రత్యేక దర్శనం రూ. 20, త్వరిత దర్శనం రూ. 100
ఆలయంలో వసతి సౌకర్యాలు
- రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 489 వసతిగదులున్నాయి. ఫోన్‌నంబర్‌: 08723-236018
- రాజేశ్వరపురం ఏసీ 4 గదులు.. అద్దె రూ. 350
- పార్వతిపురం 88 గదులు, అద్దె రూ. 200
- నందీశ్వరపురం ఏసీ సూట్స్‌ 8, అద్దె రూ. 2,000, ఏసీ గదులు 56, అద్దె రూ. 1000, నాన్‌ ఏసీ గదులు 122, అద్దె రూ. 350
- లక్ష్మీగణపతిపురంలో 88 గదులు అందుబాటులో ఉండగా.. అద్దె రూ. 250
- శివపురంలో 46 గదులు అద్దె రూ. 150
- శంకరపురంలో 58 గదులు అద్దె రూ. 50
- భీమేశ్వర వసతి సముదాయంలో రెండు గదులు.. అద్దె రూ. 2,000
- అమ్మవారి కాంప్లెక్స్‌ 8 గదులు.. అద్దె రూ. 1,000
హోటళ్లు
హరిత హోటల్‌ 8 గదులు. అద్దె నాన్‌ ఏసీ రూ. 550, ఏసీ రూ. 1000
ఎలా వెళ్లాలి?......హైదరాబాద్‌ నుంచి సుమారు 150 కి.మీ.ల దూరంలో ఉన్న వేములవాడ వెళ్లేందుకు ఎంజీబీఎస్‌.. జేబీఎస్‌ నుంచి సిద్దిపేట.. సిరిసిల్ల మీదుగా టీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులున్నాయి. సుమారు ప్రతి 30 నిమిషాలకొకటి చొప్పున బస్సు సర్వీసులున్నాయి. ఇంకా ఇతర వివరాలకు దేవస్థానం వారి అధికారిక వెబ్ సైట్ ను చూగండి.. http://www.vemulawadatemple.org