ఈ సుప్రసిద్ధ శివాలయం కరీంనగర్ జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఉన్నది.
ఈ ప్రాచీన దేవాలయం గోదావరి తీరంలో మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులలో ఉన్నది. ప్రతిరోజూ సుమారు 1000 మంది భక్తులు ఈ స్వామివారిని దర్శించి స్వామి ఆశీర్వాదాలు పొందుతారు.
స్థలపురాణం : గ్రామపెద్దలు మరియు స్థలపురాణం ప్రకారం యముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి ముక్తేశ్వరలింగమని పేరుపెట్టాడని చెబుతారు. మరియు ఒకే పానపట్టంపై కాళేశ్వరలింగాన్ని, ముక్తేశ్వలింగాలను దర్శించవచ్చు. మరియు ఈ పవిత్ర ప్రదేశంలో గోదావరి నది, సరస్వతీ నది, ప్రాణహిత నదులు కలుస్తాయి. భక్తులు అభిషేకించిన నీరు సరస్వతీ నది, ప్రాణహిత నదులలో కలిసి తరువాత గోదావరి నదిలో కలుస్తాయి. మహారాష్ట్ర కర్నాటక నుండి కూడా భక్తులు వస్తారు. త్రిలింగ దేశం అని పేరు రావటాని కారణమైన మూడు ప్రదేశాలలో కాళేశ్వరం ఒకటి, మిగతా రెండు పుణ్యక్షేత్రాలు, శ్రీశైలం మరియు ద్రాక్షారామం.
మహాశివరాత్రి, కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఎలావెళ్ళాలి : హైదరాబాద్ నుండి 277 కి.మీ. కరీంనగర్, వరంగల్, హనుమకొండ నుండి ప్రతి అరగంటకు ఆర్ టి సి బస్సులు కాళేశ్వరానికి నడుపబడుచున్నవి. గోదావరి ఖని, మంథాని, పెదపల్లి నుండి బస్సు మార్గంద్వారా కూడా వెళ్ళవచ్చు
ఆలయ దర్శనవేళలు : ఉదయం గం.04-00 నుండి మ.గం.01-00 వరకు తిరిగి సాయంత్రం గం.03-30 ని. నుండి రాత్రి గం.09-00 గంటల వరకు. ఆలయంలో అర్చలను అభిషేకాలు తగిన రుసుము చెల్లించి జరిపించుకోవచ్చు.