* రోజూ ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
* ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన. ఆపై ఉదయం 8.35 నుంచి 9.30 వరకు సహస్ర నామార్చన.. ఈ పూజలో పాల్గొనేందుకు రూ.100 టిక్కెట్‌పై ఒక్కరు లేదా దంపతులకు అనుమతిస్తారు.
* ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అర్చనలుంటాయి. వీటిల్లో రూ. 150 టిక్కెట్ ద్వారా పాల్గొనవచ్చు.
* ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొనేందుకు రూ. వెయ్యి చెల్లిస్తే.. ఒకరు.. లేదా దంపతులను అనుమతిస్తారు.
* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకూ ఆలయాన్ని మూసేస్తారు.
* రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్బార్‌సేవ జరుగుతుంది. 8.30 గంటల నుంచి 9 గంటల వరకు నివేదన. పవళింపు సేవ ఉంటుంది.