ఆ రైతు ఆశ్చర్యంతో గ్రామంలోకి వెళ్ళి గ్రామస్థులకు ఈ విషయం తెలుపుతాడు. గ్రామస్థులంతా అమ్మవారు తమ గ్రామంలో వెలసారని భావించి ఆలయం కట్టిస్తారు. అప్పటినుండి ఈ గ్రామ ప్రజలు అమ్మవారికి పూజలు చేసిన తరువాత మాత్రమే పొలం పనులు చేబడతారు
జమ్మిచేడు గ్రామంలో వెలసిన దేవత కనుక జమ్ములమ్మగా పేరు పొందింది. సమీపంలోనే పరశురాముని ఆలయం కూడా కట్టించారు. జమ్ములమ్మ కుమారుడు పరశురాముడని వీరి నమ్మకం. జూరాల ప్రాజెక్ట్ లో భాగంగా ఈ దేవాలయాన్ని తరలించాలనుకున్నారు.
కానీ సాధ్యం కాకపోవటంతో గుడి మునిగి పోకుండా ఆలయం చుట్టూ ఎత్తైన కట్ట కట్టారు.
జమ్మిచేడు నుండి పదికిలో మీటర్ల తూరంలో ఉన్న గుర్రం గడ్డ గ్రామాన్ని అమ్మవారి పుట్టిల్లుగా భావిస్తారు. ఏటా మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే మంగళవారం నాడు గ్రామస్థులంతా ఎడ్ల బండి, మేళతాళాలతో గుర్రంగడ్డకు వెళతారు. మరుసటి రోజు అమ్మవారి మూర్తిని ఆలయాని తీసుకువచ్చి ఉత్సవాలు జరుపుతారు.
భక్తుల రద్దీ పెరగటంతో రాష్ట్ర పర్వాటకశాఖ వారు ఆలయం చుట్టూ ఉన్న రిజర్వాయర్లో బోటింగ్ సౌకర్యం కల్పించారు.
ఎలా వెళ్లాలి ?
మహబూబ్ నగర్ గద్వాల రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. గద్వాల నుండి కూడా వెళ్ళవచ్చు. హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్ళే దారిలో ఎర్రపల్లి చౌరాస్తానుండి కూడా ఈ ఆలయానికి వెళ్ళవచ్చు.