ఆలంపూర్‌లో ప్రధాన దేవతలు బ్రహ్మేశ్వరస్వామి మరియు జోగులాంబ. నల్లమల అడవులలో వెలసిన ఈ ఆలయం దక్షిణకాశీగా కూడా పేరుపొందినది. పరశురాముని తండ్రి అయిన జమదగ్ని మహర్షి రేణుకా దేవి ఆశ్రమం కూడా ఇదేనని అంటారు. నవబ్రహ్మకు సంబంధించిన తొమ్మిది ఆలయాలను కూడా ఇక్కడ దర్శించవచ్చు. ఇక్కడకు దగ్గరలో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ప్రసిద్ధి చెందినది. క్రీ.శ.6వ శతాబ్ధంనాటి వస్తువులు వున్న మ్యూజియంను కూడా ఇక్కడ చూడవచ్చు.
ఈ ఆలయం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో చాళుక్యరాజులచే నిర్మించబడినది. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. కానీ జోగులాంబా దేవాలయం 14వ శతాబ్ధంలో బహమనీ సుల్తానులచే నాశనం చేయబడినది. జోగులాంబ మరియు చండీ ముండీ విగ్రహాలు బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో 2005 సంవత్సరం వరకు ఉంచి కాపాడబడినవి. తరువాత ఈ ఆలయం తిరిగి నిర్మించబడినది. చండీ ముండీ దేవతల విగ్రహాలు బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలోనే ఉంచబడి జోగులాంబ ప్రక్కనే కొత్తగా తయారు చేసిన విగ్రహాలు ఉంచబడినవి.
ఉదయం గం.06-00 నుండి రాత్రి గం.08-00 వరకు తెరచి ఉంటుంది. రోజూవారీ పూజలతో పాటు, ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి
హాశివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. అధికసంఖ్యలో భక్తులు వస్తారు.
జోగులాంబా శక్తిపీఠం మహబూబ్‌నగర్ జిల్లా ఆలపూర్‌లో కలదు. హైదరాబాద్ వైపునుండి వెళ్ళేవారు హైదరాబాద్-కర్నూల్ రైల్వేలైన్‌లో ఉన్న జోగులాంబ స్టేషన్‌లో దిగి వెళ్ళవచ్చు. (కొన్ని రైళ్ళు మాత్రమే ఈ స్టేషన్‌లో ఆగుతాయి) మరియు కర్నూలు నుండి 27 కి.మీ. దూరంలో కలదు. అక్కడ నుండి రైలు లేక రోడ్డుమార్గాలలో వెళ్ళవచ్చు.
అలంపూర్ క్షేత్రం హైదరాబాద్ నుంచి 220 కి.మీ., కర్నూలు నుంచి 25 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సు ఎక్కి అలంపూర్ చౌరస్తాలో దిగాలి. అక్కడి నుంచి ఆలయానికి (15 కి.మీ.) ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి జోగులాంబ హాల్ట్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రైల్వేస్టేషన్ నుంచి ప్రైవేట్ వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు.
దగ్గరలో .....సంగమేశ్వర ఆలయం, పాపనాశిని ఆలయాలు, కోటిలింగాల క్షేత్రం, కృష్ణా-తుంగభద్ర పుణ్యనదుల సంగమం గుందిమళ్ల చూసిరావొచ్చు