శ్రీ రంగనాయకస్వామి ఆలయం – మహబూబ్ నగర్ వనపర్తి సంస్ధానాధీశులు శ్రీరంగ క్షేత్రం (తమిళనాడు) స్ఫూర్తితో నిర్మించిన రంగనాయకస్వామి ఆలయం ఇది. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపుం గ్రామంలోని శ్రీరంగనాయకస్వామి ఆలయం తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రాన్ని గుర్తుచేస్తుంది .వనపర్తి సంస్ధానాధీశుడు రాజారామేశ్వరరావు సతీమణి రాణి శంకరమ్మ 1804లో రంగనాయకుడిని ప్రతిష్టించినట్లు చెబుతారు. క్రీ.శకం 1650-78 ప్రాంతంలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మరోకథనం ప్రచారంలో ఉంది. శంకరమ్మ అనే ఆవిడ స్వామివారి పేరుమీద రంగసముద్రం అనే చెరువును త్రవ్వించారు.
ఆలయం మొదటి అంతస్తులో శ్రీరామ పట్టాభిషేకం శిల్పం కనువిందు చేస్తుంది. శేషశయనుడైన రంగనాయకస్వామి విగ్రహం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆలయ నిర్మాణ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి విగ్రహాలను ఏర్పాటు చేయటం ఆనాటి పరిపాలకున ఔదార్యానికి గొప్ప నిదర్శనం.
ఫాల్గుణమాసంలో 15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.శరన్నవరాత్రులు, ధనుర్మాస ఉత్సవాలు, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.