header

Sri Ketaki Sangameswara Temple….శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి దేవాయలయం, జరాసంఘం (గ్రామం మరియు మండం) మెదక్‌ జిల్లా

Sri Ketaki Sangameswara Temple….శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి దేవాయలయం, జరాసంఘం (గ్రామం మరియు మండం) మెదక్‌ జిల్లా

అతి పురాతనమైన ఈ దేవాలయంలోని శివలింగం బ్రహ్మదేవునిచే పూజింపబడినది.
దేవాలయ చరిత్ర : కృతయుగంలో సూర్యవంశ రాజైన కృపేంద్ర మహారాజు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడేవాడు. ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. ఒక రోజు కేతకీ వనానికి (మొగలిపూల వనం) వేటకు వెళ్ళి కేతకీ వనంలో ఉన్న ఒక నీటి జలాశయంను గమనించాడు. అక్కడ కాళ్లు. చేతులు శుభ్రపరచుకొని ఆ నీటిని సేవిస్తాడు. వేటనుంచి తిరిగి ఇంటికి వెళ్ళిన తరువాత ఆ రాత్రి భోజనాది కార్యక్రమము ముగించుకొని నిద్రిస్తాడు. మరుసటి రోజు కృపేంద్రుని ధర్మపత్నిమైన చంద్రకళ తన భర్తకు చర్మవ్యాధి పూర్తిగా తగ్గటం గమనించి కృపేంద్రునితో ఈ విషయం చెబుతుంది. వెంటనే కృపేంద్రుడు భార్యాసమేతుడై కేతకీవనం చేరి అక్కడ భార్యతో సహా స్నానమాచరించి అక్కడి బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తాడు. ఆ సమయానికి అక్కడకి వచ్చిన నారదమహాముని వలన ఆ క్షేత్రమహిమను గురించి తెలుసుంటాడు.
ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు ఆత్మజ్ఞాన సముపార్జన కోసం తిరుగుతూ ప్రశాంతమైన ఈ క్షేత్రాన్ని గమనించి అక్కడ తపమాచరిస్తాడు. బ్రహ్మ తపస్సునకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. శివునితోపాటు బాణలింగం కూడా ఉద్భవిస్తుంది. అంతట బ్రహ్మ తన కమండలంలోని నీటితో శివలింగాన్ని అభిషేకించి సేవిస్తాడు. బ్రహ్మ, శివుభగవానుడు కలిసిన చోటు కనుక ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రమని శివుని సంగమేశ్వరుడని పిలుస్తారు.శివభగవానుడు ఈ కుండంలో స్నానమాచరించిన వారికి జ్ఞానసంపద కలుగునని, రోగముల నుండి విముక్తి కలుగునని ఆశీర్వదించి అదృశ్వమవుతాడు.
ఈ తీర్థానికి ఆగ్నేయ దిశగా కశ్యప ప్రజాపతి ఒక బదరీ వృక్షాన్ని నాటుతాడు. ఇక్కడ బదరీనారాయణుడు కొులువై ఉంటాడు.ఈ దిశలోని తీర్థానికి నారాయణ తీర్థమని పేరు. ఈ కుండమునకు దక్షిణ దిక్కున ఉన్న తీర్థానికి ధర్మతీర్థమని పేరు. ద్వాపరయుగంలో ధర్మరాజుచేత ప్రతిష్టింపబడిన ధర్మదేవత ఈ తీర్థంలో స్నానమాచరించిన వారిని ధర్మనిష్టాపరులుగా ఆశీర్వదిస్తుంది.
దక్షిణదిశ యందు దత్తదేవునిచే ప్రతిష్టించబడిన దత్తతీర్థం కలదు. పశ్చిమాన వరుణ దేవునిచే ఏర్పాటుచేయబడిన వరుణతీర్థం కలదు. వాయువ్యమున సప్తఋషులచే స్థాపించబడిన ఋషితీర్థం కలదు. అమృత కుండమునకు ఉత్తరదిశ చంద్రస్థాపితమగు సోమతీర్థం కలదు. ఈశాన్యమున రుద్రతీర్థమను జలధార కదు. ఈ తీర్థాలన్నిటిలోను స్నానం చేస్తే సర్వపాపహరణమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కృపేంద్ర మహారాజు బాణశివలింగం మీద ఆలయం కట్టించి ఆ నీటి మడుగును పుష్కరిణిగా మారుస్తాడు. అప్పటి నుండి ఈ నీటిమడుగు అష్టతీర్థ అమృతగుండం అని పిలువబడుతుంది. ఈ క్షేత్రం కూడా దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందినది.
ఈ క్షేత్రానికి మెదక్‌ వాసులే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నలుమూలనుండి భక్తులు స్వామిని దర్శించుకొని మరియు గుండపూజ జరిపిస్తారు.
సాధారణంగా శివుపూజ కోసం కేతకీ పూలను వాడరు (మొగలి పువ్వులను) కాని ఇక్కడ మొగలిపూలతో శివుని అర్చిస్తారు. అందు చేతనే ఈ క్షేత్రాన్ని కేతకీ సంగమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఈ పుష్కరిణిలోకి ఎనిమిది తీర్థాలు వచ్చి కలుస్తాయి. (నారాయణ, ధర్మ, రుషి, వరుణ, సోమ, రుద్ర, ఇంద్ర మరియు ధాత అనే తీర్థాలు) ఈ కుండంలో స్నానమాచరించి భక్తితో సంగమేశ్వరుని దర్శిస్తే సమస్తవ్యాధుల నుండి విముక్తి భిస్తుందని భక్తుల విశ్వాసం.