header

Vargal Saraswati Devi Temple / వర్గల్‌ సరస్వతీ దేవి ఆలయం

Vargal Saraswati Devi Temple / వర్గల్‌ సరస్వతీ దేవి ఆలయం

wargal saraswati devi temple మహిమాన్వితమై ఈ ఆలయం మెదక్‌ జిల్లా వర్గల్‌ గ్రామం (మండలం)లో చిన్న కొండపై ఉన్నది (గ్రామం నుండి సుమారు 1 కి.మీ.దూరం) . ఈ ఆలయం కంచి శంకరమఠం వారిచే నిర్వహించబడుచున్నది. ఈ ఆలయం అక్షరాభ్యాసాకు ప్రసిద్ధి చెందినది. ఈ సముదాయంలోనే శ్రీ శనీశ్వరస్వామి దేవాయం, శ్రీలక్ష్మీగణపతి దేవాలయం, శంకరుని దేవాలయాలను కూడా చూడవచ్చును.
వర్గల్‌ గ్రామంలో భోజనసౌకర్యం ఉండదు. కనుక మ.గం॥12.00లోపు వెళితే దేవస్థానం వారి ఉచితభోజన సౌకర్యానికి అందుకోవచ్చు. లేకపోతే భోజనం తీసుకువెళ్ళటం మంచిది. కేవల కాఫీ/టీలు మాత్రం ఉంటాయి. ఇక్కడ వేదపాఠశాల కూడా ఉంది. వేదాలను అభ్యసించే విద్యార్థులను గమనించవచ్చు. శుక్ర,శని, ఆదివారాలలో వెళ్ళటం మంచిది.
wargal saraswati devi temple దేవాలయ వేళలు : సోమవారం నుండి గురువారం వరకు ఉదయం గం॥6-30 ని. నుండి మ॥12-30 ని॥ వరకు సా.గం॥04-00 నుండి రాత్రి గం॥08-00 గంట వరకు మరియు శుక్ర,శని,ఆదివారాలో : ఉదయం గం॥6-30 ని. నుండి మ॥2-30 ని॥ వరకు సా.గం॥04-00 నుండి రాత్రి గం॥08-00 గంటల వరకు తెరచి ఉంటుంది.
ఉత్సవాలు : నవరాత్రులలో సరస్వతీదేవి జన్మనక్షత్రమై మూలానక్షత్రం రోజున ఉత్సవం జరుపుతారు. మరియు శ్రావణ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. వసంతపంచమి, శనిత్రయోదశి రోజులో కూడా భక్తులు రద్దీ అధికంగా ఉంటుంది.
భోజన సౌకర్యం : సోమవారం నుండి గురువారం వరకు : ఉదయం గం॥10-30 నుండి మ.గం.12-30 వరకు.
శుక్ర,శని,ఆదివారాలు : ఉదయం గం॥10-30 నుండి మ॥ గం.2-30 వరకు
ఎలా వెళ్ళాలి : సికింద్రాబాద్‌ జుబ్లీ బస్‌స్టేషన్‌ నుండి సుమారు 47 కి.మీ.దూరంలో (1 గంట ప్రయాణం) (కరీంనగర్‌ హైవే) ఉంటుంది వర్గల్‌ కమాన్‌. కమాన్‌ దగ్గరనుండి 5 కి.మీ. దూరంలో ఉన్న దేవాలయానికి ఆటోలో వెళ్ళవచ్చు.గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ ఆర్డనరీ బస్సులో వర్గల్‌ కమాన్‌వరకు వెళ్ళవచ్చు. లేక సిద్ధిపేట,మంచిర్వాల, వేములవాడ బస్సులో (రిక్వెస్ట్‌ స్టాప్‌ మాత్రమే) వెళ్ళవచ్చు.
అక్షరాభ్యాసాలు : అక్షరాభ్యాసాలకు ఈ దేవాలయం ప్రసిద్ధి చెందినది. అక్షరాభ్యాసానికి రూ.116 చెల్లించవలసి ఉంటుంది. అక్షరాభ్యాసానికి అవసరమయ్యే బియ్యం, పలక, మొ॥నవి దేవస్థానంలో కొనుగోలు చేయవచ్చు. లేదా సుమారు 1 కిలో బియ్యం, పూజసామాను, పలక తీసుకువెళ్ళవచ్చు.
దేవస్థానం వారి అధికారిక వెబ్ సైట్ http://srivargalvidyasaraswathi.org