నార్కట్‌పల్లి మండంలోని చెరువుxట్టు గ్రామంలో ఉన్నది. ఈ క్షేత్రం హైదరాబాద్^విజయవాడ జాతీయ రహదారిపై గల నార్కట్‌పల్లికి 4 కి.మీ దూరంలో కలదు. మరియు నల్గొండ పట్టణానికి 15 కి.మీ. దూరంలో కలదు. త్రేతాయుగం నాటిదని భావిస్తున్న ఈ పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణక్షేత్రంగా విరాజిల్లుతోంది.
స్థలపురాణం : త్రేతాయుగంలో కార్వవీర్యార్జునుడు అనే మహాపరాక్రమశాలియైన చక్రవర్తి వుండేవాడు. అతడు మహా బలవంతుడు. అతడికి వేయు చేతులు వుండేవి. అతడు ఒకరోజు తన సమస్త పరివారంతో కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటలో అలసిపోయిన రాజు విశ్రమించడానికై సమీపంలో గల జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన వద్దగల శబల అనే హోమధేనువు సహాయంతో ఆ చక్రవర్తి యొక్క సమస్త పరివారానికి షడ్రసోపేతమైన విందును అతి కొద్ది సమయంలో సమకూర్చ గలిగినాడు. అందుకు సంతోషించిన కార్తవీర్యార్జునుడు తనకు రోజూ అలా సునాయాసంగా విందుభోజనం సమకూర్చడానికై ఆ హోమధేనువును తనకిమ్మని మహర్షిని కోరాడు. అప్పుడు జమదగ్ని మహర్షి ‘‘ఓ మహారాజా ! ఈ హోమధేనువు తపః ప్రభావం వలన మహర్షుల వద్ద తనంతట తాను ఉంటుంది కాని, బలవంతంగా ఎవరివద్దా ఉంచుకొనుట సాధ్యంకాదు’’ అని హితబోధ చేస్తాడు. ఆ మాటలు పట్టించుకోని చక్రవర్తి హోమధేనువును, దాని దూడను బలవంతంగా తన రాజ్యానికి తీసుకురమ్మని తన సైనికులను ఆజ్ఞాపించాడు.
ఆప్పుడు జమదగ్ని ఆ గోవు వద్దకు వెళ్లి ‘‘ఓ తల్లీ ! నేను నిన్ను రక్షించలేకపోతున్నాను. నిన్ను నీవే రక్షించుకొని, నన్ను కూడా రక్షించు’’ అని ప్రార్థించాడు. అప్పుడా హోమధేనువు రోమముల నుండి (వెంట్రుకల) సైనికులు సమస్త ఆయుధాలతో ఆవిర్భవించి, కార్వవీర్యార్జునుని సైన్యాన్నంతటినీ క్షణకాలంలో సంహరించారు. కోపం పట్టలేని కార్తవీర్యార్జునుడు పరశురాముడు లేని సమం చూసి ఆశ్రమంపైకి దండెత్తి వెళ్ళి, జమదగ్ని తలను ఖండించి సంహరించాడు. ఆశ్రమానికి తిరిగివచ్చిన పరశురాముడు ఈ విషయం తెలుసుకొని మహాకోపోద్రేకుడై కార్తవీరార్జునిని రాజ్యంపై దండెత్తి అతడి వేయు చేతులను ఖండించి, అతడిని సంహరించాడు.
అయినా కోపం తగ్గని పరశురాముడు 21 సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రీయుడనే వాడు కనబడితే సంహరించి, భూమండలాన్ని అంతటినీ బ్రాహ్మణ శ్రేష్టుడు, బ్రహ్మ మానసపుత్రుడైన కశ్వప ప్రజాపతికి దాన దక్షిణగా సమర్పించి, శమంతపంచక తీర్థంలో ఆ క్షత్రీయ రక్తంతో తన తండ్రి అయిన జమదగ్నికి పితృతర్పణం చేసాడు.
ఆ తర్వాత విశ్వకళ్యాణార్థం కోసం లోకంలో సుఖశాంతులతో వర్థిల్లాని భావించి, 108 పవిత్ర క్షేత్రాలలో శివలింగ ప్రతిష్ట చేసి, కొన్ని లక్షల సంవత్సరాల తన తపఃశక్తిని ప్రతి క్షేత్రంలోను తాను ప్రతిష్టించిన శివలింగానికి ధారపోసి విశ్వశాంతిని నెలకొల్పాడు.
పరశురాముడు ప్రతిష్టించిన 108 శివలింగాలో ఆఖరిది చెరువుగట్టు క్షేత్రంలో ప్రతిష్టించి ఈ స్థలంలోనే తపోనిష్టతో ఎన్నో లక్షల సంవత్సరాు తపస్సు చేసినా, శివుడు ప్రత్యక్షం కానందుకు ఆగ్న్రహించి తాను ప్రతిష్టించిన శివలింగంపై తన పరశువు (గొడ్డలితో) కొట్టాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ‘‘ఇన్నాళ్ళు నువ్వు తపస్సు చేసి నన్ను మెప్పించిన ఈ క్షేత్రం సుప్రసిద్ధ క్షేత్రాలో ఒకటై ప్రకాశిస్తుందని, ఇక్కడనుండి కలియుగాంతం వరకు నేను నిలిచి యుండి భక్తుల మొక్కులను, చిరకా వాంఛలను నెరవేరుస్తుటాను’’ అని వాగ్ధానం చేసి అంతర్థానమయ్యాడు. నాటి నుండి ఈ క్షేత్రం సుప్రసిద్ధ భైరవక్షేత్రంగా పేరుపొంది,భక్తుల పాలిట మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతుంది. ఈ దేవస్థానం నందు పార్వతీ అమ్మవారి ఆలయం గట్టు (కొండ) కింద కలదు. శ్రీ మల్లికార్జునస్వామి లింగం, శ్రీ భద్రకాళి వీరభద్రస్వామి దేవతలు కూడా ఈ క్షేత్రంలో కొలువైయున్నారు. గట్టుమీద మూడు గుండ్లపై ఒక శివలింగం, గోవు గర్భమను కొలను ఇతర పరివార దేవతలు కొలువై, భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తానన్నారు. ఈ దేవస్థానమందు ప్రతి నెల అమావాస్యకు దాదాపు 70 వేలకు పైగా భక్తులు వచ్చి, శ్రీ స్వామివారిని దర్శించుకొని, ఆ రాత్రి అక్కడే నిద్రచేసి, మరుసటి రోజు శ్రీ స్వామివారిని దర్శించుకొని వెళ్ళుట ఆచారం.