header

Sri Bhadrakali Temple, Warangal……శ్రీ భద్రకాళీ ఆలయం, వరంగల్‌ జిల్లా

Sri Bhadrakali Temple, Warangal……శ్రీ భద్రకాళీ ఆలయం, వరంగల్‌ జిల్లా

bhadrakali temple, warangal bhadrakali temple, warangal చారిత్రాత్మక నగరమైన వరంగల్‌ పట్టణము నందు భద్రకాళీ ఆలయం కలదు. విశాలమైన ఆవరణలో ఉన్న ఈ ఆలయంలో ప్రధాన దేవత భద్రకాళి అమ్మవారు. శ్రావణ మాసంలో అమ్మవారిని వివిథ రూపాలలో అలంకరిస్తారు. భక్తులు కూడా శ్రావణమాసంలో అధిక సంఖ్యలో వస్తారు.
వరంగల్‌ పట్టణం ఒకప్పటి కాకతీయుల రాజధాని నగరం (ఓరుగల్లు). ఆలయానికి అనుకుని ఉన్న భద్రకాళి చెరువు వరంగల్‌, హనుమకొండ ప్రజలకు త్రాగునీటిని అందించుచున్నది. ఇంకా ఇక్కడ ఆలయం ఎదురుగా ఉన్న పార్కు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆలయానికి ప్రవేశించే దారిలో ఉన్న సాయి మందిరాన్ని కూడా చూడవచ్చు. గోశాలను కూడా దర్శించవచ్చు.
దేవాలయ స్థల చరిత్ర :ఈ దేవాలయాన్ని చాళుక్య రాజైన రెండవ పులకేశి క్రీ॥శ॥ 625లో దేవాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారములు లభించినవి. తరువాత కాలంలో కాకతీయ రుద్రదేవుడు తన రాజధానిని వరంగల్‌కు మార్చినపుడు ఈ దేవాలయాన్ని అభివృద్ధి గావించాడు. గణపతి దేవుని కాలంలో అతని మంత్రి హరి తటాకమును త్రవ్వించి దేవాలయమునకు కొంత భూమిని సమర్పించాడు.
కాకతీయ సామ్రాజ్య పతనానంతరము మరియు క్రీ॥శ॥ 1675లో తళ్ళికోట యుద్దానంతరము 925 సం॥ వరకు మహావైభవంగా ఉన్న ఈ దేవాలయం మతాంతురులచే కొంతభాగం నాశనం చేయబడినది. భూములు అన్యాక్రాంతం కాబడినవి.
స్వాతంత్య్రానంతరం శ్రీ మగన్‌లాల్‌ సమేజ గారు పురజనుల సహాయంతో ముత్తవల్లి శ్రీ బి యస్‌ గణేష్‌ గారి నేత్రత్వంలో ఆలయం జీర్ణోద్దరణ గావించబడి 29-07-1950 న సంప్రోక్షణలు జరిపిన తరువాత పూజాపురస్కారములు జరుప బడుచున్నవి. ప్రస్తుతం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలో ఉన్నది.
అమ్మవారి చీరలు : భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలను దేవస్థానం వారు భక్తుల కోసం తగ్గింపు ధరతో విక్రయిస్తారు. ఈ విక్రయశాల దేవస్థానం ఆవరణలోనే ఉన్నది.
ఆలయ దర్శన సమయాలు : ఉదయం గం. 5.30 ని. మధ్యాహ్నం 1.00 గంట వరకు తిరిగి మ. 3 గంటల నుండి సాయంత్రం గంటల 5.30 నిమిషాల వరకు దేవాలయం తెరచి ఉంటుంది.
ఈ ఆలయానికి వచ్చినవారు ఇక్కడకు దగ్గరలోనే ఉన్న వేయుస్తంభాల గుడి మరియు హనుమకొండ కోటను కూదా దర్శించవచ్చు. ప్రసిద్ధి పొందిన రామప్ప దేవాలయం మరియు పాకాల చెరువు వరంగల్‌ పట్టణానికి షుమారు 80 కి.మీ దూరంలో కలవు.
ప్రయాణ మార్గాలు : వరంగల్‌ పట్టణాని రైలు బస్సు మార్గాల ద్వారా చేరుకోవచ్సు. హైదరాబాద్‌ నుండి విజయవాడ (విజయవాడ నుండి హైదరాబాద్‌) రైలు మార్గంలో వరంగల్‌ పట్టణం ఉన్నది. వరంగల్‌ రైల్వే స్టేషన్‌ నుండి కేవలం 5 కి.మీ. దూరంలో వరంగల్‌ - హానుమకొండ రహదారిలో ఈ ఆలయం కదు. ఆటోలో లేదా బస్‌లో ఇక్కడకు చేరుకోవచ్చు.