ఆలయ చరిత్ర
రాష్ట్రకూట రాజైన భీమరాజు కురవిని (నేటి కొరవి సీమను) పాలించేవాడు. అతడే వీరభద్ర ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత కాలంలో శిధిల స్థితికి చేరుకున్న ఆలయాన్ని కాకతీయ పాలకుడు ఒకటో బేతరాజు పునర్నిర్మించాడు. ఓసారి కురవి ప్రాంతంలో అల్లకల్లోలం తలఎత్తింది. శత్రుమూకలు స్వైరవిహారం చేశాయి. అపార ప్రాణనష్టం కలిగించాయి. ఆ సమయంలో వీరభద్రుడు ప్రత్యక్షమై, దుష్టులను చంపినట్లు చరిత్ర. కొన్నిసార్లు మానవరూపంలో వచ్చి ప్రజలతో ఆటలు ఆడేవాడట, పాటలు పాడేవాడట. అంతలోనే హఠాత్తుగా అదృశ్యమయ్యేవాడట. కాకతీయ వీరనారి రుద్రమాంబ వీరభద్రుడిని దర్శించుకుని కానుకలు సమర్పించినట్లు తెలుస్తుంది. ఈ క్షేత్రం కాకతీయుల పాలనలో ప్రసిద్ది చెందినది. శివరాత్రికి ఈ క్షేత్రం కైలాసగిరిని తలపిస్తుంది. భద్రకాళి, వీరభద్రుల వివాహం అంగరంగ వైభవంగా జరుపుతారు. రధోత్సం జరుగుతుంది. ప్రభల బళ్ళు కడతారు.
ఎలా వెళ్ళాలి ?
వరంగల్ జిల్లా కురవి మండలంలో ఉంది ఈ ఆలయం. మహబూబ్ నగర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి కర్నూలు రైలు మార్గంలో ప్రయాణించి మహబూబా బాద్ లో దిగి అక్కడనుండి కురవికి వెళ్ళవచ్చు.
వసతి సౌకర్యం : కురవీ దేవస్ధానం వారి వసతి గదులలో ఉండవచ్చు. ఇతర వివరాలుకు సంప్రదించండి : ఫోన్ 08719 277232