header

Charminar / ఛార్మినార్

Charminar / ఛార్మినార్

Charminar / ఛార్మినార్ చారిత్రాత్మకమైన ఈ కట్టడం క్రీ॥శ॥ 1591 సంవత్సరంలో కట్టబడినది. 56 మీటర్ల ఎత్తున్న ఈ కట్టడం నాలుగు ప్రక్కలా నాలుగు మినార్లతో కట్టబడినది.ఈ మినార్ల లోపల నుండి పైకి ఎక్కుటకు మెట్లు కలవు. ఈ ప్రాంతం గాజులకు ప్రసిద్ధి. మరియు బిర్యానీ, హలీమ్‌ వంటకాలకు ప్రసిద్ధి. సంక్రాంతి పండుగ రోజులలో గాలిపటాల అమ్మకాలతో సందడిగా ఉంటుంది.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు చార్మినార్‌ను ఎక్కవచ్చు.
చార్మినార్ సుల్తాన్ కుతుబ్ షాహి వంశస్థుడైన మహ్మద్ కులి కుతుబ్ షాచే నిర్మించబడింది.హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న చార్ మినార్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. చార్మినార్ అప్పటి నిర్మాణ శైలికి మచ్చుతునకగా చెప్పవచ్చు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. మెదటి, రెండవ అంతస్తలలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించబడింది. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. అనేక ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో చూడవచ్చు.
ఎలా వెళ్ళాలి
చార్మినార్‌ వెళ్ళుటకు హైదరాబాద్‌, నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుండి మరియు మహాత్మా బస్‌ స్టాండ్‌ నుండి, బాలానగర్‌, టోలీచౌక్‌, సనత్‌నగర్‌, గోల్కొండ నుండి బస్‌లో వెళ్ళవచ్చు.ఆటోలలో కేబ్ లలో వెళ్లవచ్చు