మాదాపూర్ లోని దుర్గం చెరువు హైదరాబాద్ లోని సందర్శనా స్థలాలలో ఒకటి. కలుషితంగా ఉన్న ఈ చెరువును శుభ్రపరచి సందర్శనాస్థలంగా మార్చారు. ఈ చెరువు వద్ద వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేయబడ్డవి. వీటితో పాటు ప్లే ఏరియా, ఓపెన్ ఎరియా జిమ్ లు కూడా ఏర్పటు చేయబడ్డవి. ల్వాండ్ స్కేప్ కనులకు విందు చేస్తుంది. పిల్లలు ఆడుకునేందుకు ఆటవస్తువులు, ఉయ్యాలలు, జారుడుబండలు ఏర్పాటు చేయబడ్డవి. వేలాడే వంతెన : దుర్గం చెరువుపై వేలాడే వంతెనను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు చివరిదశలో ఉన్నాయి (సెప్టంబర్, 2019). మాదాపూర్...జూబ్లీహిల్స్ ను కలుపుతూ ఈ వంతెనను నిర్మిస్తున్నారు.