header

Golconda / గోల్కొండ పర్యాటకం

Golconda Tour గోల్కొండ పర్యాటకం .....

Golconda / గోల్కొండ పర్యాటకం చారిత్రాత్మకమైన ఈ గొప్ప కోట హైదరాబాద్‌కు పశ్చిమదిశలో ఉన్నది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులచే కట్టబడినది. తరువాత కుతుబ్‌ షాహీల చేత పునర్‌నిర్మించబడినది. 11 కిలోమీటర్ల వ్యాసార్థంలో 15 నుండి 18 అడుగు ఎత్తులో ఉన్న గోడలతో కట్టబడినది. గోల్కొండకు 8 ప్రవేశద్వారాలు మరియు 70 ఋజువులు కలవు. ప్రసిద్ధి చెందిన వజ్రాలు రీజెండ్‌, నూర్‌-ఉల్‌-ఏన్‌, కోహినూర్‌ ఇక్కడ దొరికినవే అని చెబుతారు. 17వ శతాబ్ధంలో ఢిల్లీ షాదూషా ఔరంగజేబ్ ఈ కోటను స్వాధీనం చేసుకుని ఉద్దేశ పూర్వకంగా చాలాభాగం నాశనం చేయించాడు. రామభక్తుడుగా పేరుపొందిన భక్తరామదాసును గోల్కొండ కోట చెరసాలలోనే బంధించబడ్డాడు. ఈ చెరసాలను ఇప్పడు కూడా చూడవచ్చు.
ప్రతి రోజూ గోల్కొండ చరిత్ర గురించి మ్యూజికల్‌ షో నిర్వహించబడుచున్నది. వ్యాఖ్యాత ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాత
ప్రతి సోమవారం మ్యూజికల్‌ షోకు సెలవు.
మ్యూజికల్‌ షో సమయాలు : మ్యూజికల్‌ షో ప్రదర్శన కాలం : 55 నిమిషాలు
నవంబర్‌ నుండి ఫిబ్రవరి వరకు సాయంత్రం 6-30 గంటకు
మార్చి నుండి అక్టోబర్‌ వరకు సాయంత్రం 7 గంటలకు
ఆదివారం మరియు బుధవారం : ఇంగ్లీషు భాషలో మంగళవారం, శుక్రవారం మరియు శనివారం హిందీ భాషలో
గురువారం తెలుగులో
మ్యూజికల్‌ షోకు ప్రవేశరుసుము చెల్లించాలి
గోల్కొండకు ఎలా వెళ్ళాలి
నాంపల్లి, కోఠి, మహాత్మాగాంథీ బస్‌ స్టేషన్‌, మెహిదీపట్నం బస్‌స్టాండ్‌ నుండి సిటీ బస్‌లో వెళ్ళవచ్చు. ట్రాఫిక్‌ దృష్ట్యా ఛార్మినార్‌ నుండి గండిపేట దారిలో వెళ్ళటం ఉత్తమం.