header

Mahaveeri Harini Park/ మహావీర్ హరిణి పార్క్

Mahaveeri Harini Park/ మహావీర్ హరిణి పార్క్

Mahaveeri Harini Park/ మహావీర్ హరిణి పార్క్ హరిణి జింకల పార్కు హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారికి (9 వ నెంబర్‌) దగ్గరలో వనస్థలిపురంలో ఉన్నది. హైదరాబాద్‌ నుండి షుమారు 15 కి.మీ దూరం.ఇక్కడ నల్లజింకలు, తెల్లజింకలు మరియు రకరకాల పక్షులను చూడవచ్చు. హరిణి జింకల పార్కు హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారికి (9 వ నెంబర్‌) దగ్గరలో వనస్థలిపురంలో (హైకోర్టు కాలనీ బస్ స్టాప్) ఉన్నది. హైదరాబాద్‌ నుండి షుమారు 15 కి.మీ దూరం.
ఇక్కడ నల్లజింకలు, తెల్లజింకలు మరియు రకరకాల పక్షులను చూడవచ్చు. జింకలను చూడటానికి పార్కు యజమాన్యం బస్ రైడ్ ఏర్పాటు చేసారు. ఈ రైడ్ రెండున్న కిలోమీటర్లు సాగుతుంది. ఈ రైడ్ లో జింకలు, దుప్పులు, నెమళ్లను చూడవచ్చు. ప్రశాంతమైన వాతారణంలో అందమైన పూలచెట్లు, సీతాకోక చిలకల పార్కు కలదు. ఇక్కడి వాతావరణం ప్రశాంతగా ఉంటుంది
ఈ పార్కు సుమారు 3600 ఎకరాలలో వ్యాపించి ఉన్నది. వివిధ రకాల ఔషధ మొక్కలు, జంతువులు, పక్షులతో కళ్లకు విందుచేస్తుంది. ఈ పార్కులో 1200 క్రిష్ణ జింకలు,గడ్డి జింకలు, పొడ దుప్పీలు, కొండగొర్రెలు, నెమళ్లు, అడవి పందులు కలవు.
బటర్ ఫ్లై పార్క్ : ఇదే పార్కులో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో సీతాకోక చిలుకల పార్కు విస్తరించి ఉన్నది. వివిధ రకాల సీతాకోక చిలుకలు కనువిందు చేస్తాయి.
పార్కు తెరచి ఉంచే వేళలు ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 5-00 వరకు మాత్రమే. ఈ పార్కుకు ప్రతి ప్రతి సోమవారం సెలవు. పార్కులో ప్రవేశానికి బస్ రైడ్ కు నిర్ణీత రుసుము చెల్లించాలి (రూ.30..)