header

Nehru Zoo Park / నెహ్రూ జ్యూలాజికల్ పార్క్

Nehru Zoo Park / నెహ్రూ జ్యూలాజికల్ పార్క్
Nehru Zoo Park / నెహ్రూ జ్యూలాజికల్ పార్క్

380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జంతుప్రదర్శనశాల హైదరాబాద్‌కు తలమానికం. ఈ జంతుప్రదర్శనశాల భారతదేశంలో అతి పెద్ద జంతుప్రదర్శనశాలలో ఒకటిగా పేరుపొందినది. 1963లో ప్రారంభించబడిన ఈ పార్కుకు భారతదేశ ప్రధమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూగారి పేరు పెట్ట బడినది. పిల్లలకు. పెద్దలకు, కొత్త జంటలకు మంచి పర్యాటక స్థలం. ప్రక్కనే ఉన్న మీర్‌ ఆలం చెరువు షుమారు 600 ఎకరాల వీస్తిర్ణంలో ఉండి విదేశీపక్షులకు ఆవాసంగా ఉన్నది. మీర్ ఆలం చెరువులో బోటింగ్ సౌకర్యం కలదు.
ఇక్కడ మనం సెంట్రల్‌ ఆఫ్రికా నుండి తెచ్చిన చింపాంజీలను, రకరకాల కోతులను, ఖడ్గమృగాలను, చిరుతలు, సింహాలు, పులులు ఏనుగులను దర్శించవచ్చు.
ఆఫ్రికా సింహం, హిమాయన్‌ బ్లాక్‌ ఎలుగుబంటి, మయన్‌ సన్‌ ఎలుగుబంటి, చిరుతపులులు, తెల్లపులి, భారత దేశవాళి సింహాం,ఇంకా పాములు, కొండచిలువలు, హైనాలు, తోడేళ్ళను చూడవచ్చు.
తాబేళ్ళు, మొసళ్ళు, రంగురంగుల చిలకలు, పావురాళ్ళు, నెమళ్ళు ఇంకా అనేక రకాల పక్షులను కూడా చూడవచ్చును.
. సౌకర్యాలు : ట్రైన్‌ రైడ్, బోట్‌, ఎనుగు సవారీ ఇక్కడ ప్రత్యేకత. పలహారశాలలు మరియు అతిధిగృహం కలవు. ప్లాస్టిక్ సంచులు లోపలకు తీసుకువెళ్లటం నిషేధించ బడ్డాయి. మంచినీరు, ఆహారం బయటనుండి తీసుకు వెళ్లవచ్చు.
జూ పనిచేయు వేళలు :
ప్రతి సోమవారం మాత్రమే సెలవు మిగతా అన్నిరోజులలో జూ తెరవ బడుతుంది.
ఏప్రియల్‌ నుండి జూన్‌ వరకు : ఉదయం 8 గంట నుండి సాయంత్రం 5 గంట 30 ని॥ వరకు
జులై నుండి మార్చి వరకు ఉదయం 8 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు.
ప్రవేశ రుసుము : రైలు బండికి, సాధారణ ఏనుగు సవారీ, మహారాజా ఏనుగు సవారీ సఫారీ కార్లకు ( 5 వ్యక్తుల వరకు)
లారీలు/ట్రక్కుల సినిమా షూటింగ్‌ లకు, జూ వారిచే బ్యాటరీ వాహనంకు విడిగా రుసుము చెల్లించాలి
అతిధిగృహం : ఉదయం 9 గంటనుండి సా.5-30 ని.వరకు రూ.200- 10 మందికి, రూ.2000 పదిమందికి మించి
అతిధిగృహం డైరక్టర్‌ ఆఫీసు వద్ద మందుగా బుక్‌ చేసుకొనవలెను
ఫోటోలు తీసుకొనుటకు చెల్లించవలసిన రుసుము
సాధారణ ఫొటోలు తీసుకొనుటకు రూ.20-
వృత్తి నిపుణులకు రూ.500-
వృత్తి నిపుణలకు వీడియో కెమెరాకు రూ.500-
సినిమా షూటింగ్‌కు యూనిమేట్‌ వీడియో/ సీనీ కెమెరాతో : రూ.8500- (ఒక్కో లోకేషన్‌కు) రూ1500- జనరేటర్‌ ఉచితం