రాచరికపు వైభావానికి ప్రతీకగా కుతుబ్షాహీల ప్రధాన మంత్రి నివాస గృహంగా గుర్తింపు పొందిన పురానీ హవేలీ సాలార్జంగ్ మ్యూజియం సమీపంలో ఉంది. యూ ఆకారంలో ఉన్న ఈ రాజ భవనంలో అనేక విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఒక భాగాన్ని మ్యూజియంగా రూపొందించారు. ప్రపంచ ప్రఖ్యాత నిజాం వార్డ్రోబ్ మ్యాన్యువల్ లిఫ్ట్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. 30 నిమిషాల పాటు ప్రదర్శనలో విశేషాలు వీక్షించే అవకాశం ఉంది.