header

Salar Jung Museum / సాలార్ జంగ్ మ్యూజియం

Salar Jung Museum / సాలార్ జంగ్ మ్యూజియం

Salar Jung Museum / సాలార్ జంగ్ మ్యూజియం్ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ మ్యూజియం హైదరాబాద్ కు చెందిన ఓ గొప్ప సంపద. సాలార్ జంగ్-3 చే 40 సంవత్సరాలపాటు దేశ విదేశాల నుండి సేకరించబడిన అనేక అద్భుతమైన కళాఖండాలు, శిల్పాలు, చిత్రాలు, పురాతన వస్తువులు, ఆయుధాలు, కార్పెట్స్, పెయింటింగ్స్, ఇంకా అనేక వస్తువులు ఈ మ్యూజియంలో భద్రపరచారు.
మ్యూజియం విశేషాలు : సాలార్‌జంగ్‌ మ్యూజియం మొత్తం 3 భవనాలలో రెండు అంతస్తులలో కట్టబడినది. మొత్తం 38 గదులతో 3 బ్లాక్స్‌గా విభజించబడి ఉన్నది.


01. భారతీయ బ్లాక్‌
02. తూర్పు బ్లాక్‌
03. పశ్ఛిమ బ్లాక్‌
భారతీయ విభాగం క్రింది అంతస్తులో ప్రదరించబడు వస్తువులు :
2 నెం గది ఫౌండర్స్‌ గ్యాలరి
3 నెం గది భారతీయ చేనేత మరియు కంచు పరికరాలు
5 నెం గది భారతీయ విగ్రహాలు
6 నెం గది దక్షిణాది ఆర్ట్స్‌ విభాగాలు
7 నెం గది భారతీయ చేనేత విభాగం
8 నెం గది దంతాలతో నిర్మించబడ్డ కోచ్‌
9 నెం గది పిల్లల విభాగం
10 నెం గది పిల్లల విభాగం
11 నెం గది దంతంచే చేయబడిన వస్తువులు
12 నెం గది రెబక్కా
14 నెం గది ఆయుధాల గ్యారీ
16 నెం గది భారతీయ మోడరన్‌ పెయింటింగ్స్‌
17 నెం గది భారతీయ సూక్ష్మ చిత్రాలు
మొదటి అంతస్తు : (ప్రధాన భవనం , మెయిన్‌ బిల్డింగ్‌)
18 నెం గది బొమ్మలు
19 నెం గది ఫ్లోరా మరియు ఫానా
24 నెం గది భారతీయ వెండి సామాన్ల గ్యాలరీ
25 నెం గది కార్పెట్స్‌ గ్యాలరీ
28 నెం గది జేడ్‌
29 నెం గది బిద్రి వేర్‌
30 నెం గది కాశ్మీర్‌ గ్యాలరీ
32 నెం గది యుటిలిటి గ్యాలరీ
తూర్పు విభాగం : మెదటి అంతస్తు
1 నెం గది చైనీస్‌ గ్వాలరీ
2 నెం గది పోర్సిలియం
3 నెం గది జపనీస్‌ గ్యాలరీ
4 నెం గది ఈస్టరన్‌ విగ్రహాలు
క్రింది అంతస్తు :
6 నెం గది యూరోపియన్‌ కంచు వస్తువులు
7 నెం గది యూరోపియన్‌ మార్బుల్‌ విగ్రహాలు
ఒకటవ అంతస్తు
1 నెం గది యూరోపియన్‌ పెయింటింగ్స్‌
2 నెం గది యూరోపియన్‌ గ్లాస్‌
3 నెం గది ఫ్రెంచ్‌
4 నెం గది యూరోపియన్‌ గడియారాలు
ఇతరములు :
మొదటి అంతస్తు :
23 నెం గది అరబిక్‌ మరియు పర్షియన్‌ చేతివ్రాత ప్రతులు
26 నెం గది ఈజిప్షియన్‌ మరియు సిరియన్‌
33 నెం గది పశ్ఛిమ దేశాల చెక్క సామాన్లు
పనిచేయు వేళలు :
ఉదయం 10 గంటల నుండి సా.5 గంటల వరకు. ప్రతి శుక్రవారం సెలవు.
మరియు ఈ క్రింది పర్వదినాలలో కూడా మ్యూజియం మూసివేయబడుతుంది.
మిలాద్‌-ఉన్‌-నబి
డా॥ అంబేద్కర్‌ జయంతి
సాలార్‌జంగ్‌ వర్థంతి
రంజాన్‌
దసరా
బక్రీద్‌
మెహర్రం
ఎలా వెళ్ళాలి ?
బస్సులో వెళ్ళేవారు అఫ్జల్‌గంజ్‌ దగ్గరకు బస్సులో వెళ్ళి అక్కడ నుండి నడచి వెళ్ళవచ్చు. దగ్గరలో గల ఇతర ముఖ్య ప్రదేశాలు : చార్మినార్‌, మక్కా మసీద్‌, హైకోర్టు, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరరీ, ఉస్మానియా జనరల్‌ హాస్పటల్‌