ఈ జలపాతం తెలంగాణా రాష్ట్రంలోని జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని వాజీడు మండలంలోని కోయవీరాపురం (జి) గ్రామానికి దగ్గరలో ఉంది. చూపరులకు కనువిందుచేసే ఈ జలపాతం రాష్ట్రంలోనే రెండవ పెద్దదైన జలపాతం. ఈ జలపాతాన్నే తెలంగాణా నయాగరా అని అంటారు.
సాహసం మరియు ఉత్సాహమున్న యువతకు ఇది చక్కటి ట్రెక్కింగ్ ప్రదేశం. నవంబర్ లో పర్యటనకు అనుకూలం నీరు ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడకు చేరుకోవటాని ఇంకా సరియైన రోడ్డు మార్గం వేయబడలేదు. కొంత దూరం నడచి వెళ్లాలి. జూన్ నుండి నవంబర్ వరకు ఈ జలపాతాన్ని సందర్శించటానికి అనువైన సమయం. ఈ సమయంలో జలపాతంలో నీరు ఎక్కువగా ఉండి చూపరులకు కనువిందు చేస్తుంది. అద్భుతమైన, ఆకర్షణీయమైన ఈ జలపాతం తెలంగాణా రాష్ట్రంలోనే రెండవ ఎత్తైన జలపాతం.
ఈ జలపాతం భద్రాచలానికి 120 కిలో మీటర్ల దూరంలో ఉంది. భద్రాచలం నుండి కోయవీరాపురం (జి) గ్రామానికి రోడ్డుమార్గం ద్వారా వెళ్లవచ్చు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా ఇంకా అభివృద్ధి చేయవలసి ఉంది.సరియైన రోడ్డు లేదు. కొంత దూరం ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది. ఐనా వారాంతపు సెలవులలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు. మంచినీరు, ఆహారపదార్థాలు ఇక్కడ లభించవు. పర్యాటకులు తమవెంట మంచినీరు ఆహారం తీసుకువెళ్లటం మంచిది.
Bogata Waterfall jumps about a height of 50 feet. It is in the shape of world’s famous Nayagara waterfalls (horse shoe shape). Due to rapid flow, the water is formed into a large pool at the bottom of the falls. Swimming is considered safe here. But due to fore waterfall, precautions must be taken. Visitors must carry their food and water because there is no hotel facility available here.
How to go : Bogata waterfalls resided in Chikupalli Village of Jayasankar Bhupalpalli dist. There is no comfort road to this waterfall. Visitors need to walk 500 meters to reach this place. It ts 30 km from Eturnagaram (Warangal dist)