అద్భుతమైన నిర్మాణశైలితో సందర్శకులను ఆకట్టుకుంటుంది ఖమ్మం కోట. క్రీ.శకం 960 సంవత్సరంలో ముసునూరి కమ్మరాజుల హయాంలో ఈ కోట నిర్మించబడింది. ఖమ్మం నగరం మధ్యలో ఉన్న స్తంభాద్రి అనే కొండపై ఈ కోట ఉంది.
షుమారు 500 సంవత్సరాల పాటు ముసునూరు కమ్మ రాజుల పరిపాలనలో ఈ కోట ఉంది. తరువాత కుతుబ్ షాహీలు ఆక్రమించుకున్నారు. ఆ తరువాత 17 వ శతాబ్ధంలో అసఫ్ జాహీల పాలనలోకి వచ్చింది. శత్రుదుర్భేద్యంగా ఈ కోట నిర్మించబడింది. 10 ప్రవేశ ద్యారాలు కలిగి నాలుగు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నిర్మించబడింది ఈ కోట. కోట చుట్టూ 60 ఫిరంగులను ఏర్పాటు చేశారు.
అరవై అడగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పుగల జాఫర్ బావిని ఇక్కడ చూడవచ్చు. వర్షపు నీటిని నిలవ చేయటానికి నీటికాలువలను ఏర్పాటు చేయబడ్డాయి. కోటపై దాడి జరిగినపుడు తప్పించుకోవటానికి రహస్య సొరంగమార్గం ఉంది. ఖమ్మం పట్టణానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ముఖ్యపట్టణాల నుండి రైలు మరియు బస్సు సౌకర్యాలున్నాయి. పర్యాటకులు ఖమ్మం పట్టణంలో బసచేయవచ్చు.