header

Bhimuni Jalapatham, warangal / భీముని జలపాతం

Bhimuni Jalapatham, warangal / భీముని జలపాతం
భీముని జలపాతం వరంగల్ జిల్లా, గూడూరు మండలం, సీతానగరం గ్రామానికి దగ్గరలోని అటవీ ప్రాంతంలో పచ్చని చెట్లు, ఎత్తైన గుట్టల మధ్యనుండి వచ్చే ఈ జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతం చూడటం క అద్భుతమైన అనుభూతి. పాండవులు వనవాస సమయంలో ఈ గుట్టలలో నివసిస్తున్నపుడు సమీపంలోని సీతానగరం గ్రామం మంటల్లో కాలిపోతుండగా భీముడు ఈ జలపాతంలో కాలు వేసి నీటిని చేతులతో గుప్పించి మంటలను ఆర్పివేశాడని గ్రామస్తులు చెబుతారు. భీముడు కాలు వేసిన ప్రాంతాన్ని భీముని గుంట అని పిలుస్తారు. ఎండాకాలంలో సహితం ఈ జలపాతంలో నీరు ఉంటుంది. వర్షాకాలంలో పర్యాటకులు ఎక్కువగా వస్తారు.