header

Bogata Waterfalls……బొగత జలపాతం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

Bogata Waterfalls……బొగత జలపాతం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా
బోగతా జలపాతం సుమారు యాభై అడుగుల ఎత్తు నుంచి జలజల సవ్వడితో నురగలు కక్కుతూ దూకుతుంది. ఇది ప్రపంచ ప్రఖ్యాత నయాగరా జలపాతంలా.. గుర్రపు నాడా ఆకారంలో ఉంటుంది. వర్షాకాలం మొదలు నిండుగా ప్రవహిస్తూ.. పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. వేగంగా దుమికే జలధారలతో జలపాతం కింద భారీ గుండాలు ఏర్పడ్డాయి. దేవతలు వచ్చి ఈ గుండాలలో స్నానం చేస్తారని స్థానికుల విశ్వాసం. అందుకే బొగత జలపాతాన్ని స్థానికులు పుణ్యతీర్థంగా భావిస్తారు.
ఈ జలపాతం జన్మస్థానం ....ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని పామనూరు కొండలు అక్కడ నుండి తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం చీకుపల్లి దగ్గర 50 అడుగుల ఎత్తునుండి.. కొందికి దుముకుతుంది. ఇటీవల ఈ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువవుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల నుంచి పర్యాటకులు వస్తున్నారు.. జలపాతం దగ్గర నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత వహించాలి..
ఎలా వెళ్లాలి?
తెలంగాణా రాష్ట్రంలోని జయశంకర్ భూపాల పల్లి జిల్లా చీకుపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. చీకుపల్లి నుండి సరియైన రోడ్డు సౌకర్యం లేనందువల్ల చీకువల్లినుండి సుమారు 500 మీటర్లు నడవవలసి ఉంది. పర్యాటకులు ఆహారం, మంచినీరు తీసుకు వెళ్లటం మంచిది.
Bogata Waterfall
Bogata Waterfall jumps about a height of 50 feet. It is in the shape of world’s famous Nayagara waterfalls (horse shoe shape). Due to rapid flow, the water is formed into a large pool at the bottom of the falls. Swimming is considered safe here. But due to fore waterfall, precautions must be taken. Visitors must carry their food and water because there is no hotel facility available here.
How to go : Bogata waterfalls resided in Chikupalli Village of Jayasankar Bhupalpalli dist. There is no comfort road to this waterfall. Visitors need to walk 500 meters to reach this place. It ts 30 km from Eturnagaram (Warangal dist)