header

Gaddalasari Waterfalls…గద్దల సరి జలపాతం

Gaddalasari Waterfalls…గద్దల సరి జలపాతం
గద్దల సరి జలపాతంలో దాదాపు ఏడువందల అడుగుల నుండి నీళ్లు కిందికి దుముకుతాయి. ఆ తర్వాత అడవిలో 10. కి.మీ. దూరం వరకు ప్రవహిస్తుంది. ఇది కర్ణాటకలోని జోగ్, మేగాలయలోని ఎత్తయిన జలపాతాల సరసన నిలుస్తుంది. గద్దలు ఎగిరేంత ఎత్తులో ఉండటంతో స్థానిక గిరిజరులు దీనని గద్దల సరి గుండంగా పిలుస్తారు.
ఈ జలపాతం దేశంలోని ఎత్తయిన జలపాతాలలో మూడవది. మొదటి జలపాతం ఎత్తు 1000 అడుగులు. ఇది మేఘాలయాలలోని నోహకాలికి జలపాతం. రెండవది కర్నాటకలోని జోగ్ జలపాతం. దీని ఎత్తు 830 అడుగులు.
గద్దలసరి జలపాతం ఎక్కడ ఉంది ?
ఈ జలపాతం తెలంగాణా రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలోని చెర్ల-వెంకటాపురం డివిజన్ లో ఉంది. ఈ జలపాతానికి వెళ్లాలంటే భూపాలపల్లి జిల్లాలోని రొయ్యూరు-పూసూరు మధ్య ఉన్న వంతెనను దాటి చర్ల మార్గంలో 28 కి. ప్రయాణించి నాయకపోడు కోయ గిరిజనుల గూడెం రామచంద్రాపురాని చేరుకోవాలి. అక్కడనుంచి 9 కి.మీ. దూరంలో ఎత్తయిన గుట్టల ప్రాంతంలో గద్దలసరి జలపాతం ఉంది.