(మొఖ్రాం) నిర్మల్ నుండి ఇక్కడకు 36 కి.మీ. దూరం. మొఖ్రాం గ్రామం నుండి 5 కి.మీ నడచి వెళ్ళాల్సి ఉంటుంది. వర్షాకాలంలో వెళ్ళటం మంచిది కాదు.
కనకాయ్ జలపాతాలు మొత్తం మూడు కలవు. రెండవ జలపాతం ప్రధానమైనది. మొదటి జలపాతానికి చేరుకోవాలంటే 2 కి.మీ. మట్టిరోడ్డు గుండా నడవాల్సి ఉంటుంది.
ఈ జలపాతాలు బజరత్నూరు గ్రామంలో ఉన్నవి. నిర్మల్ నుండి 40 కి. మీ దూరంలో ఉన్న ఎకోడాకు తరువాత 10 కి.మీ. దూరంలో ఉన్న బజరత్నూర్‌కు వెళ్ళాలి. బజరత్నూర్ నుండి సరియైన రోడ్డులేదు. గ్రామస్ధుల నుండి పూర్తివివరాలు సేకరించి వెళ్ళటం మంచిది. ఆహారం, నీరు వెంట తీసుకువెళ్ళాలి.
కుంతల జలపాతానికి వెళ్ళే దారిలో ఉన్న ఈ జలపాతం మంచి పిక్‌నిక్ కేంద్రం. బందం రేగడి మరియు కొర్టికల్ గ్రామాల మధ్యలో ఉంటుది
ఈ జలపాతం మరియు జలపాతానికి దగ్గరలోనే 4 లేన్ల జాతీయ రహదారిని చూడవచ్చు. నిర్మల్ నుండి కొర్టికల్‌కు 15 కి.మీ. దూరం.