header

bhuvanagiri fort Bhuvanagiri Fort…భువనగిరి కోట
భువనగిరి కోట యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువన గిరి పట్టణంలో ఉంది. ఏకశిలపై నిర్మించబడిన ఈ ధృడమైన కోట 300 అడుగుల ఎత్తులో ఉంది.
40 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ కోట పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువనమళ్ల విక్రమాదిత్యచే నిర్మించబడింది. భారీశిలలతో రెండు ద్యారాలు కల ఏకైక కోట ఇది. శత్రువుల కోటలోకి ప్రవేశించకుండా నాలుగువైపుల కందకం ఏర్పాటుచేయబడ్డది. ఉక్కు తలుపులు, ఆయిధ భాండాగారం, గుర్రపుశాలలు, సరస్సులు, మంచినీటి బావులు సందర్శకులను ఆకర్షిస్తాయి. కోట బురుజుపైనుండి చుట్టుపక్కల ప్రదేశాలను చూడవచ్చు
ఎలా వెళ్లాలి..?.. భువనగిరి హైదరాబాద్ కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ భువనగిరి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి వెళ్లే కొన్ని రైళ్లు భువనగిరిలో ఆగుతాయి.