header

Kawal Wild Life Sanctuary…కవాల్‌ వన్యప్రాణి రక్షితకేంద్రం


ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం ఆదిలాబాద్‌ జిల్లాలో 893 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. టేకు వృక్షాలతో, సహజంగా ఏర్పడిన ప్రకృతి దృశ్యాలతో జనసంచారం లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు పెద్దపులులు. ఇంకా నల్లచిరుతలు, చీతల్‌, నీల్ గాయ్‌, సాంబార్‌ జాతికి చెందిన జింకలు, దుప్పులు, చిన్న ప్రమాణంలో ఉన్న (మౌస్‌ డియర్‌) జింకలు, ఎలుగుబంట్లు(స్లాత్‌ బీర్‌ జాతివి) ఇంకా అనేక జాతి పక్షులు, ప్రాకే జంతువులకు ఇది రక్షిత కేంద్రం.
వృక్షజాతులు : వెదురు, కరక్కాయ, రక్తచందనం, కసింద చెట్టు, సిరిమాను చెట్లు ఈ అటవీ ప్రాంతలో పెరుగుతాయి.
ఎలా వెళ్ళాలి : హైదరాబాద్‌ నుండి 260 కి.మీ. మంచిర్యాల నుండి 50 కి.మీ. (రోడ్డు మార్గం) దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : జన్నారం మరియు మంచిర్యాలలో అటవీశాఖ వారి అతిధిగృహాలు కలవు. నవంబర్‌ నుండి మే వరకు పర్యటనకు అనుకూలం.
ఇతర వివరాకుల ఈ క్రింది చిరునామాలో సంప్రదించవచ్చు
Divisional Forest Officer (Wildlife Management), Jannaram,
Adilabad District. Phone: - 08739-236224.
Forest Range Officer, Jannaram Phone 08739-236688