Dhana Trayodasi…ధనత్రయోదశి...భగినీహస్త భోజనం
ధనత్రయోదశి – ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్షు ఈ మూడింటికోసం పరమాత్మను ప్రార్థించే పండుగే ధనత్రయోదశి.
దీపావళి మరుసటి రోజు బలిపాడ్యమి. ఆ తరువాత రోజే ధనత్రయోదశి లేక యమద్వితీయగా పిలుస్తారు.
భగినీహస్తభోజనం : యమధర్మరాజు సోదరి యమున. ఆమె తన అన్నను ఎంతోకాలంగా భోజనానికి పిలుస్తుంటుంది.
యమధర్మరాజుకు తీరికలేక వాయిదా వేస్తూవస్తాడు. ఈ రోజున (దీపావళికి మూడవరోజు-త్రయోదశి) తీరిక చేసుకొని చిత్రగుప్తునితో సహా తన సోదరి ఇంటికి వస్తాడు.
యమున ఆనందానికి హద్దులులేవు. స్వయంగా అన్నగారికి కొసరి కొసరి కమ్మని విందుభోజనాన్ని వడ్డిస్తుంది. ఈమె ఆతిధ్యానికి సంతసించి యమద్వితీయ రోజున
సోదరులకు ఆప్యాయంగా అన్నం పెట్టే తోబుట్టువులకు అపమృత్యుభయం వుండదని వరమిస్తాడు యమధర్మరాజు. దీన్నే భగినీ హస్తభోజనంగా పిలుస్తారు.
ధన్వంతరీ పూజ: క్షీరసాగరమధనం తరువాత అమృతభాంఢాన్ని స్వామివారు ధన్వంతరీ రూపంలోనే తీసుకువస్తాడు. త్రయోదశినాడు ధన్వంతరీపూజ చేస్తారు.
తులసీదళాలతో స్వామిని పూజిస్తారు.