header

Karteeka Masam....కార్తీక మాస స్నానాలు....

Karteeka Masam....కార్తీక మాస స్నానాలు....

ప్రాచీనులు ఏ నియమాన్ని మన సంప్రదాయంలో పెట్టినా దానిలో ఆధ్యాత్మిక రహస్యంతోపాటు వైద్య సామాజిక దృక్పధాలు తప్పక ఉండి తీరుతాయి. శరత్కాలం (ఆశ్వయుజ, కార్తీకమాసాలు) వసంత కాలం (చైత్రం, వైశాఖం) ఈ రెండూ వాతావరణంలో వచ్చే రెండు మార్పులకి సంధికాలం.
శరత్కాలంలో చలితో పాటు మంచూ ఉంటే, వసంతకాలంలో మంచూ మంచుతోపాటు పెరుగుతున్న ఎండలూ ఉంటాయి. ఎవరి శరీరమైనా ఒక తీరు వాతావరణానికి తట్టుకోగ్గుతుంది కానీ భిన్న వాతావరణాల మధ్య సంధికి తట్టుకోలేదు. దాంతో శరీర రక్షణవ్యవస్థ శరత్‌, వసంతకాలాల్లో దెబ్బతింటుంది. అందుకే ఈ రెండు ఋతువులను యమదంష్ట్రిక కాలం అంది శాస్త్రం. .
ఉబ్బసం, అతిశ్లేష్మం, దగ్గు వంటి వ్యాధులన్నీ విజృంభించే ఈ కాంలో ఆ వ్యాధిగ్రస్తులంతా తగిన జాగ్రతను పాటించాల్సిందే. ఇక ముందుకాలంలో ఈ తీరు వ్యాధులు తమకి రాకూడదనే ముందుజాగ్రత్త మనకి ఉన్నట్లయితే తప్పక ఈ శరత్కాలంలో (అక్టోబరు-నవంబరు) తెల్లవారుజామున శరీరానికి చన్నీటి స్నానాన్ని అలవాటు చేయించాలి. స్నానాలను ప్రారంభించిన మొదటివారంలో దగ్గు, పడిసెం, గొంతు మారడం లేదా పూడిపోవడం వంటి వ్యాధులొచ్చినా అలాగే స్నానం చేస్తూన్నట్లయితే శరీరం ఆ పరిస్థితికి అలవాటు పడిపోతుంది. .
ఇలా అలవాటు చేయించి వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకే ఈ కార్తీకంలో ఈ స్నానానికి అందునా తెల్లవారుజామునే అదికూడా తలారా చేసితీరాలిందేనని మన పెద్దలు నియమబద్ధంగా శాసించారు. .
స్నానాలు కార్తీకంలోనేనా? ఏ నెలలోనూ ఉండని చిత్రమైన విధానం ` స్నానానికి ` ఈ నెలలోనే ఎందుకేర్పాటు చేశారనేది అందరికీ వచ్చే సందేహం. .
కార్తీకానికి వెనుక ఆశ్వయుజం దానికి వెనుక ఉన్నది భాద్రపదం, భాద్రపద మాసంలో వినాయకుణ్ణి ఓషధి గుణాలున్న 21 పత్రాలతో లక్షల సంఖ్యలో భక్తులు పూజచేసి ఆ పత్రాలను నీటిలో కలుపుతారు. ఆ ఆకుల ఔషధగుణం నీటికి చేరుతుంది. .
ఆ వెంటనే వచ్చే ఆశ్వయుజమాసంలో అమ్మవారిని అనేకవిధాలైన రంగు పుష్పాలతో లక్ష సంఖ్యలో భక్తులు పూజచేసి ఆ పుష్పాలను నీటిలో కలుపుతారు ( బతుకమ్మ పండుగల్లో నిమజ్జనాన్ని చూస్తే అర్థమౌతుంది) ఆ పుష్పాల్లో దాగిన ఔషధగుణం కూడా నీటికి చేరుతుంది. .
ఆ వెంటనే వస్తున్న ఈ కార్తీకంలో అప్పటి పత్రి ఔషధగుణం ఇప్పటి పుష్పాల ఔషధగుణం దాగిన నీటిలో వరుసగా నెలరోజుపాటు స్నానాల్ని చేస్తే ఆ పత్ర పుష్ప ఔషధగుణం ఈ వ్యక్తికి కలుగుతుందంటారు. మనమీద మహర్షుల కెంతటి దయాగుణమో దీన్నిబట్టి అర్థం చేసుకోవాలి. .
ఇలా నెలరోజుపాటు చలికి లెక్కచేయకుండా నిద్రనుంచి లేవగలగడం కొంతదూరం వెళ్ళి స్నానం చేసి రావడమనేదానికి శరీరానికి అలవాటు చేస్తే దీనిమీదట రాబోయే మార్గశీర్షమాసంలో (ధనుర్మాసం) తెల్లవారుజాము కాలానికి లేవటానికి అలవాటైపోతుంది. చలికి అలవాటుపడిన శరీరానికి మార్గశీర్ష, పుష్యమాసాల్లో పడే మంచుని కూడా తట్టుకోగలిగిన శక్తి అపారంగా వస్తుంది.
ఇలా ఆధ్యాత్మికం, వైద్యం అనే రెంటితో ముడివడిన స్నానమనేది ఎంత చక్కని సంప్రదాయ విధానం.
గమనిక : శ్వాసకోస వ్యాధులున్నవారు, చన్నీటిస్నానం పడనివారు, చాలావృద్ధులు, శిశువు ఈ స్నానాలు చేయకూడదు. ఆరోగ్యం రాకపోగా వైద్యంకోసం తిరగాల్సి ఉంటుంది. అలాగే సంప్రదాయానికి చెడ్డ పేరు వస్తుంది.